నందినీ రెడ్డి బర్త్ డే: నువ్వు లేకపోతే నేనేం చేయలేనంటూ సమంత ఎమోషనల్
ఈ వార్తాకథనం ఏంటి
మార్చ్ 4వ తేదీన పుట్టినరోజు జరుపుకుంటున్న డైరెక్టర్ నందినీ రెడ్డి కి శుభాకాంక్షలు వస్తూనే ఉన్నాయి. ఐతే ఇన్ స్టాగ్రామ్ లో సమంత షేర్ చేసిన పోస్ట్ మాత్రం అందరినీ ఆకర్షించింది.
నందినీ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన సమంత, తన ప్రేమను అయిదారు వాక్యాల్లో తెలియజేసింది.
బాధల్లో ఉండాలనిపించినా కూడా ఆ బాధల నుండి దూరం చేసే నీలాంటి ఫ్రెండ్ ప్రతీ ఒక్కరికీ అవసరం. నన్నెప్పుడూ ఉత్సాహంగా ఉంచుతావు, నాలో ఎక్కడలేని శక్తిని ఇస్తావు, నువ్వు లేకుండా నేనేం చేయగలను, హ్యాపీ బర్త్ డే నందూ రెడ్డి అని విష్ చేసింది.
ఇప్పుడు ఈ పోస్ట్ ట్రెండింగ్ లో ఉంది.
సమంత
Event ఓ బేబీ సినిమాకు కలిసి పని చేసిన సమంత, నందినీ రెడ్డి
సమంత, నందినీ రెడ్డి కలిసి జబర్దస్త్, ఓ బేబీ సినిమాలకు పని చేసారు. వీటిల్లో జబర్దస్త్ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఓ బేబీ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది.
కొరియన్ మూవీ రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం, బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లను సాధించడంతో పాటు నటన పరంగా సమంతకు మంచి ప్రశంసలు దక్కాయి.
ప్రస్తుతం సమంత నుండి శాకుంతలం మూవీ వస్తోంది. సమంత కెరీర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీగా రూపొందిన శాకుంతలం సినిమా, ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కి సిద్ధమవుతోంది.
గుణ శేఖర్ దర్శకతం వహించిన ఈ సినిమాను గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమా గుణ నిర్మిస్తోంది.