యాక్షన్ ఇచ్చిన బహుమతులంటూ గాయాలను చూపుతున్న సమంత
స్టార్ హీరోయిన్ సమంత, సినిమాల షూటింగుల్లో పాల్గొనడానికి వచ్చేసింది. మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత, ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ కోసం సిటాడెల్ అనే సిరీస్ లో నటిస్తోంది. ఈ సిరీస్ కోసం సమంత చాలా కష్టపడుతోంది. ఆ విషయం ఆమె పోస్ట్ చేసిన ఫోటో ద్వారా అర్థమైపోతుంది. సిటాడెల్ షూటింగ్ లో ఆమె చేతులకు గాయాలయ్యాయి. చేతులకు ఒరుసుకుపోయినట్లు, రక్తం వస్తున్నట్లు ఫోటోలో కనిపిస్తోంది. ఈ ఫోటో కింద ఆమె పెట్టిన క్యాప్షన్ ఇంకా ఆసక్తిగా ఉంది. యాక్షన్ ఇచ్చిన బహుమతులు అని పెట్టడం గమనించాల్సిన విషయం. ప్రస్తుతం ఈ ఫోటో, ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. సమంత పడుతున్న కష్టాన్ని చూసి చాలామంది కదిలిపోతున్నారు.
తెలుగు సినిమా ఖుషీ కోసం రెడీ అవుతున్న సమంత
సినిమా షూటింగులకు సమంత రెడీ అయినప్పటి నుండి అందరి దృష్టి ఖుషీ మూవీపై పడింది. విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా సమంత నటిస్తోంది. గత కొంతకాలంగా ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయింది. సమంత వచ్చేవరకు చిత్రబృందం వెయిట్ చేస్తోంది. ఇటు సిటాడెల్ షెడ్యూల్ పూర్తికాగానే ఖుషీ కోసం సమంత రానుందట. ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఖుషీ మూవీని, శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నారు. అదలా ఉంచితే ఏప్రిల్ 14వ తేదీన సమంత నటించిన శాకుంతలం మూవీ విడుదలవుతోంది. కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన శాకుంతలం సినిమాను గుణ శేఖర్ డైరెక్ట్ చేసారు. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై నీలిమా గుణ నిర్మిస్తున్నారు.