Mirzapur The Movie: థియేటర్లలో 'మిర్జాపూర్' మాస్ జాతర.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు చేరువ!
ఈ వార్తాకథనం ఏంటి
ఓటిటిలో సంచలనం సృష్టించిన 'మిర్జాపూర్' ఫ్రాంచైజ్ ఇప్పుడు బిగ్‌స్క్రీన్‌పై కూడా తన సత్తా చాటుతోంది. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు తదితరులు నటించిన 'మిర్జాపూర్ ది మూవీ' సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. రిలీజ్‌కు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. విడుదలైన తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద మంచి జోరు కొనసాగిస్తోంది. తొలి రోజు నుంచే సినిమాకు మంచి ఓపెనింగ్ లభించింది. రెండో రోజు కలెక్షన్లు మరింత పెరిగాయి. ఇక ఆదివారం సెలవు కావడంతో ప్రేక్షకులు భారీగా థియేటర్లకు తరలివచ్చారు. ట్రేడ్ రిపోర్టుల ప్రకారం.. కేవలం మూడు రోజుల్లోనే 'మిర్జాపూర్ ది మూవీ' ప్రపంచవ్యాప్తంగా రూ.96.85 కోట్ల వసూళ్లు సాధించింది.
వివరాలు
కాలీన్ భయ్యా, గుడ్డు పండిట్, మున్నా సందడి
దీంతో ఈ సినిమా రూ.100 కోట్ల మైలురాయికి కేవలం అడుగు దూరంలో నిలిచింది. 'మిర్జాపూర్' సిరీస్‌లో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన పాత్రలు మరోసారి వెండితెరపై కనిపించడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
పంకజ్ త్రిపాఠి పోషించిన 'కాలీన్ భయ్యా' పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అలీ ఫజల్ మరోసారి గుడ్డు పండిట్ గా, దివ్యేందు మున్నా పాత్రలో కనిపించారు.
ఈముగ్గురు ప్రధాన పాత్రధారులు తిరిగి తెరపైకి రావడంతో 'మిర్జాపూర్' సిరీస్ అభిమానులకు థియేటర్లలో పండగ వాతావరణం కనిపిస్తోంది.
ప్రస్తుతం సినిమా దూకుడు చూస్తుంటే.. రూ.100 కోట్ల నెట్ మార్క్‌ను ఈ రోజే అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఫీట్ పెద్ద కష్టంగా అనిపించడం లేదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
వివరాలు
తెలుగు వెర్షన్ మాత్రం నిరాశే..
అయితే సోమవారం నుంచి సినిమా ఇదే జోరును ఎంతవరకు కొనసాగిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు 'మిర్జాపూర్ ది మూవీ' తెలుగు వెర్షన్ మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపడం లేదు.
తొలి మూడు రోజుల్లో ఈ వెర్షన్ కేవలం రూ.84 లక్షల నెట్ వసూళ్లు మాత్రమే సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో సినిమా చాలా నెమ్మదిగా సాగడానికి ప్రధాన కారణాల్లో ప్రమోషన్లు ఒకటిగా కనిపిస్తున్నాయి.
తెలుగు మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ప్రమోషన్లు బలంగా నిర్వహించకపోవడంతో.. సినిమా ప్రమోషనల్ కంటెంట్ తెలుగు ప్రేక్షకుల్లోకి ఆశించిన స్థాయిలో వెళ్లలేకపోయింది.
దీంతో థియేటర్ల వద్ద ఈ వెర్షన్‌కు కనీస బజ్ కూడా ఏర్పడలేదని తెలుస్తోంది.