LOADING...
Divyenndu Sharma: రామ్‌చరణ్ RC16 సినిమాలో 'మీర్జాపూర్' నటుడు.?
రామ్‌చరణ్ RC16 సినిమాలో 'మీర్జాపూర్' నటుడు.?

Divyenndu Sharma: రామ్‌చరణ్ RC16 సినిమాలో 'మీర్జాపూర్' నటుడు.?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 22, 2024
03:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనా దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. 'ఆర్‌సీ 16' వర్కింగ్ టైటిల్‌తో ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంతో సాగే స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిన ఈ చిత్రం డిసెంబరులో సెట్స్ పైకి వెళ్లనుంది.

వివరాలు 

కీలక పాత్రలో దివ్యేందు శర్మ

ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం ప్రకారం, ఈ సినిమాలో మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు శర్మ కీలక పాత్రలో నటించనున్నాడు. మీర్జాపూర్‌లో మున్నా భయ్యా పాత్ర ద్వారా మంచి పేరు తెచ్చుకున్న దివ్యేందు, ఇప్పుడు 'ఆర్‌సీ 16'లో కీలక పాత్రకు ఎంపికయ్యాడని వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు, రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుండగా, సంగీతం అందించేందుకు రెహమాన్‌ను ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీగా ఆసక్తి నెలకొంది.