LOADING...
Akhanda 2: అఖండ 2 కోసం మిశ్రా ద్వయం.. ఇక సౌండ్ బాక్సులు బద్దలవ్వాల్సిందే!
అఖండ 2 కోసం మిశ్రా ద్వయం.. ఇక సౌండ్ బాక్సులు బద్దలవ్వాల్సిందే!

Akhanda 2: అఖండ 2 కోసం మిశ్రా ద్వయం.. ఇక సౌండ్ బాక్సులు బద్దలవ్వాల్సిందే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2025
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

తమన్ అనే పేరు ఇప్పుడు ఒక్కసారి చెబితే వెంటనే స్పీకర్లు పగిలిపోతున్నట్టే ఉంది. ఎక్కడ చూసినా, విన్నా, ఇప్పుడు ప్రతి చర్చ తమన్ మ్యూజిక్ గురించే. తన మ్యూజిక్ ద్వారా ప్రేక్షకులను మాయాజాలంలో ముంచెత్తడంలో తమన్ ప్రత్యేక స్థానం సంపాదించాడు. రీసెంట్‌గా వచ్చిన 'ఓజీ' సినిమాలో ఆయన అందించిన ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజిక్ సెట్ ఈ సినిమా పీక్స్‌ని కొత్త రేంజ్‌కి తీసుకెళ్లింది. నిజానికి, ఓజీ సినిమాకు కథ ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, సుజీత్ డైరెక్షన్, తమన్ మ్యూజిక్ కలిపి సినిమాను పూర్తి బ్లాక్‌బస్టర్‌గా మార్చేశాయి. ఈ విజయాన్ని చూసిన తరువాత, అందరి దృష్టి తమన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అఖండ 2పై ఉంది.

Details

డిసెంబర్ 5న అఖండ్ 2 రిలీజ్

ఎందుకంటే అఖండ సినిమాకు ఆయన అందించిన మ్యూజిక్ ఏ రేంజ్‌లో దుమ్ము తీయడమే కాదు, మాస్ బీజీఎమ్‌తో మెంటల్ స్టేట్‌కి తీసుకెళ్తూ, డివోషనల్ మ్యూజిక్‌తో ఆడియెన్స్‌ను ట్రాన్స్‌లోకి తేల్చేలా చేసింది. తమన్ ఈ సీక్వెల్ కోసం, ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్ ఇచ్చే విధంగా మిశ్రా ద్వయాన్ని (పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా) రంగంలోకి తీసుకొచ్చాడు. వీరి సంస్కృత శ్లోకాలు, వేద మంత్రోచ్ఛారణ వింటే ఎవరికి అయినా పూనకం రావడం ఖాయం. ఇప్పటికే వీరి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ మిశ్రా ద్వయం అఖండ 2 బీజీఎమ్‌లో ప్రత్యేకతను మరింత పెంచబోతోంది. ఇక, బాలకృష్ణ-బోయపాటి కాంబోలో వస్తున్న అఖండ 2 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.