ఓటీటీలోకి వచ్చేసిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి: స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో రూపొందిన ఈ సినిమాను మహేష్ బాబు పి తెరకెక్కించారు. రొమాంటిక్ కామెడీ జోనర్లో రూపొందిన ఈ చిత్రం, థియేటర్ల వద్ద ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ తో పాటు సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దాంతో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రం బ్లాక్ బాస్టర్ అయ్యింది. అంతేకాదు 50కోట్ల క్లబ్ లో కూడా చేరింది. ఈ చిత్ర విజయంతో నవీన్ పొలిశెట్టి కెరీర్ లో హ్యాట్రిక్ విజయాలు అందుకున్నాడు.
నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేసిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి
అయితే థియేటర్ల వద్ద మంచి సక్సెస్ అందుకున్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రం ప్రస్తుతం ఓటీటీలో విడుదలైంది. నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రం వచ్చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. థియేటర్లలో ఎవరైతే ఈ సినిమాను మిస్ అయ్యారో ఇప్పుడు ఓటీటీలో చూసేయవచ్చు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో జయసుధ, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తి, అభినవ్ గొమఠం ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. రాధన్ సంగీతం అందించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ నిర్మించారు.