LOADING...
Rakesh Bedi: తప్పుగా అర్థం చేసుకున్నారు.. సారా అర్జున్‌ ముద్దుపై రాకేశ్‌ బేడీ స్పందన
తప్పుగా అర్థం చేసుకున్నారు.. సారా అర్జున్‌ ముద్దుపై రాకేశ్‌ బేడీ స్పందన

Rakesh Bedi: తప్పుగా అర్థం చేసుకున్నారు.. సారా అర్జున్‌ ముద్దుపై రాకేశ్‌ బేడీ స్పందన

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 19, 2025
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల జరిగిన ఒక ఈవెంట్‌లో సీనియర్‌ నటుడు రాకేశ్‌ బేడీ తనకంటే చిన్న వయసున్న సారా అర్జున్ కు ముద్దుపెట్టిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై వచ్చిన విమర్శలకు సంబంధించిన ఇంటర్వ్యూలో రాకేశ్‌ స్పష్టత ఇచ్చారు. తండ్రి తన కుమార్తెను ముద్దు పెట్టుకున్నట్లే ఆప్యాయంగా సారాను పలకరించానని ఆయన పేర్కొన్నారు. రాకేశ్‌, సారా ఇద్దరూ 'ధురంధర్' సినిమాలో తండ్రీ-కూతురు పాత్రల్లో నటించారు. ఆ సినిమా వేడుకలో సారా వేదికపైకి రాగానే రాకేశ్‌ ఆమెను పలకరించారని, దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం తెలివి తక్కువ పని అని ఆయన వ్యాఖ్యానించారు.

Details

ప్రధాన పాత్రలో అక్షయ్ న్నా, రణ్ వీర్ సింగ్

సారా నా కంటే వయసులో చాలా చిన్నది. షూటింగ్ సమయంలోనూ మేమిద్దరం సొంత కుటుంబం లాంటిదే ఉన్నాం. ఆమె ప్రతి విషయాన్ని నాతో పంచుకునేది. తెరపై కూడా మా అనుబంధం కనిపించింది. అందుకే వేడుకలో ఆమె వేదికపైకి వచ్చిన వెంటనే దగ్గరగా తీసుకున్నాను. యువతిపై వృద్ధుడి ప్రేమ అని అందరూ రాశారు, కానీ తండ్రి-కుమార్తె ప్రేమలా ఎవరు చూడలేదు. వాళ్లు తప్పుగా అర్థం చేసుకుంటే మనం ఏం చేయగలమని చెప్పారు. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఫిల్మ్‌ ఇప్పటివరకు రూ.700 కోట్ల వసూలు చేసింది. ప్రత్యేకంగా భారత్‌లోనే రూ.400 కోట్లకు పైగా సాధించినట్లు చిత్రబృందం తెలిపారు.

Advertisement