Page Loader
Mithun Chakraborty: మిథున్ చక్రవర్తికి ఛాతీలో నొప్పి.. ఆస్పత్రిలో చేరిక 
Mithun Chakraborty: మిథున్ చక్రవర్తికి ఛాతీలో నొప్పి.. ఆస్పత్రిలో చేరిక

Mithun Chakraborty: మిథున్ చక్రవర్తికి ఛాతీలో నొప్పి.. ఆస్పత్రిలో చేరిక 

వ్రాసిన వారు Stalin
Feb 10, 2024
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ నటుడు, బీజేపీ నాయకుడు మిథున్ చక్రవర్తి శనివారం ఉదయం అస్వస్థతకు గుర్యయారు. ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆయన్ను కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. శనివారం ఉదయం అకస్మాత్తుగా ఛాతీలో నొప్పితో ఆయన కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. గతేడాది నవంబర్‌లో టీవీ షో 'సరిగమపా' ఎపిసోడ్‌కు మిథున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ అతని కుమారుడు నమషి చక్రవర్తి తండ్రికి ఒక భావోద్వేగ వీడియో పంపగా.. అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిథున్ చక్రవర్తి