Mithun Chakraborty: మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
మన దేశంలో సినీ రంగానికి సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డు ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఈ సంవత్సరం ఈ అవార్డుకు ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి ఎంపికైనట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. అక్టోబర్ 8న జరగనున్న 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఈ అవార్డును అందజేయనున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 74 ఏళ్ల మిథున్ చక్రవర్తి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గత కొన్ని దశాబ్దాలుగా క్షేమంగా కొనసాగుతున్నారు. 1982లో విడుదలైన "డిస్కో డ్యాన్సర్" చిత్రంతో ఆయన విశేష గుర్తింపు పొందారు.
"గోపాల గోపాల" సినిమాలో స్వామీజీ పాత్ర
బెంగాలీ, హిందీ, ఒడిశా, భోజ్‌పురి, తమిళ్, కన్నడ, పంజాబీ భాషల్లో దాదాపు 350కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచతమే. పవన్ కల్యాణ్ "గోపాల గోపాల" సినిమాలో స్వామీజీ పాత్రలో మెప్పించారు. రాజకీయాలలో ఆసక్తి చూపించి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి 2014లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే, రెండేళ్లకే ఆ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.