తదుపరి వార్తా కథనం

Pavitranath: ప్రముఖ సీరియల్ నటుడు కన్నుమూత
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 02, 2024
10:43 am
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బుల్లితెర తెలుగు సీరియల్స్ చక్రవాకం, మొగలిరేకులులో ఇంద్ర తమ్ముడిగా దయ పాత్రలో నటించి మెప్పించిన నటుడు పవిత్రనాథ్ కన్నుమూశారు.
ఈ విషయాన్ని ఇంద్రనీల్ భార్య మేఘన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మేఘన పోస్ట్‌పై నెటిజనులు,సెలబ్రిటీలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అతడి మృతిపై పలువురు సంతాపం ప్రకటించారు.
ఇక గతంలో పవిత్రనాథ్‌పై అతడి భార్య సంచలన ఆరోపణలు చేసింది. అతడికి అమ్మాయిల పిచ్చి ఉందని.. తన ముందే ఇంటికి వారిని తీసుకువచ్చేవాడని.. దీని గురించి ప్రశ్నిస్తే.. తనను కొట్టేవాడని ఆరోపణలు చేసింది.
అయితే అతని మరణం గురించి కారణాలు మాత్రం తెలియరాలేదు .
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మొగలిరేకులులో దయ పాత్రధారి పవిత్రనాథ్ మృతి
Rest in Peace #Pavithranath 💔🙏#Mogalirekulu #Tollywood #iDreamMedia pic.twitter.com/J01k2QPSyA
— iDream Media (@iDreamMedia) March 2, 2024