Page Loader
Mokshagna:''యాక్షన్‌ కోసం సిద్ధమా?''.. మోక్షజ్ఞ న్యూ లుక్‌ వైరల్‌
మోక్షజ్ఞ న్యూ లుక్‌ వైరల్‌

Mokshagna:''యాక్షన్‌ కోసం సిద్ధమా?''.. మోక్షజ్ఞ న్యూ లుక్‌ వైరల్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 29, 2024
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

న‌టుడు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తాజాగా తన సినీ కెరీర్‌ను ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఇప్పటికే విడుదలైంది. తాజాగా ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ కొత్త లుక్‌కు సంబంధించిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. "యాక్షన్ కోసం సిద్ధమా?" అని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. ఈ పోస్టర్‌కు 'సింబా ఈజ్ కమింగ్' అనే హ్యాష్‌ట్యాగ్ జత చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. మోక్షజ్ఞ కొత్త లుక్‌పై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా రూపొందుతోంది.

వివరాలు 

నటన, ఫైట్లు, డ్యాన్సులలో మోక్షజ్ఞ ప్రత్యేక శిక్షణ

'లెజెండ్ ప్రొడక్షన్స్'తో కలిసి 'ఎస్‌.ఎల్‌.వి.సినిమాస్' పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సమర్పిస్తున్నారు.ఈ సినిమా,మన ఇతిహాసాల స్ఫూర్తితో ఒక సోషియో-ఫాంటసీ చిత్రం గా రూపొందుతోందని చెప్తున్నారు. ఈ సినిమా బాలకృష్ణ విజన్‌కి అనుగుణంగా,చిరస్మరణీయంగా నిలిచిపోతుందని భావిస్తున్నారు. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 6న ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ''మన ఇతిహాసాలు,అద్భుతమైన కథలు,బంగారు గనిలాంటి స్ఫూర్తి ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇది నా సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోంది.మోక్షజ్ఞని పరిచయం చేయడం నాకు గొప్ప గౌరవం.బాలకృష్ణ నాపైన,నా కథపైన ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు'' అని ప్రశాంత్ వర్మ పూర్వం తెలిపారు. ఈ సినిమాలో నటన, ఫైట్లు, డ్యాన్సులలో మోక్షజ్ఞ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రశాంత్ వర్మ చేసిన ట్వీట్