NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / మోసగాళ్లకు మోసగాడు: మొట్టమొదటి పాన్ వరల్డ్ సినిమా గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు 
    మోసగాళ్లకు మోసగాడు: మొట్టమొదటి పాన్ వరల్డ్ సినిమా గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు 
    సినిమా

    మోసగాళ్లకు మోసగాడు: మొట్టమొదటి పాన్ వరల్డ్ సినిమా గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 28, 2023 | 11:54 am 1 నిమి చదవండి
    మోసగాళ్లకు మోసగాడు: మొట్టమొదటి పాన్ వరల్డ్ సినిమా గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు 
    మోసగాళ్ళకు మోసగాడు సినిమా విషయాలు

    సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సరికొత్త టెక్నాలజీలను పరిచయం చేయడంలో సూపర్ స్టార్ కృష్ణ ఎప్పుడూ ముందుంటారు. మొట్టమొదటి డీటీఎస్ చిత్రం తెలుగువీర లేవరా, మొదటి ఈస్ట్ మన్ కలర్ చిత్రం ఈనాడు, మొట్టమొదటి సినిమాస్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజు, మొట్టమొదటి 70ఎంఎం స్టీరియో ఫోనిక్ సౌండ్ చిత్రం సింహాసనం.. ఇలా సరికొత్త టెక్నాలజీలను తెలుగు సినిమాకు తీసుకొచ్చారు కృష్ణ. ఇదే వరుసలో మొట్టమొదటి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 1971లో రిలీజ్ అయిన ఈ చిత్రం మొట్టమొదటి పాన్ వరల్డ్ చిత్రంగా పేరు తెచ్చుకుంది.

    50దేశాల్లో విడుదల 

    మోసగాళ్లకు మోసగాడు చిత్రం తమిళంలో, మోసక్కారనుక్కు మోసక్కారన్, హిందీలో ఖజానా, ఇంగ్లీషులో ది ట్రెజర్ అనే పేరుతో రిలీజ్ అయింది. ఇంగ్లీషులో ఈ సినిమా సుమారు 50 దేశాల్లో విడుదల అయింది. ఇంగ్లీష్ లో రిలీజ్ చేసేటప్పుడు పాటలను పూర్తిగా తీసేశారు. భారతదేశపు మొట్టమొదటి కౌబాయ్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు కే.ఎస్.ఆర్ దాస్ దర్శకత్వం వహించారు. పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ఈ సినిమాను నిర్మించారు. కృష్ణ పెద్ద కూతురు పద్మావతి పేరు మీదుగా పద్మాలయ బ్యానర్ ను స్టార్ట్ చేశారు కృష్ణ. హాలీవుడ్ చిత్రాలైన మెకనాస్ గోల్డ్, గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ సినిమాల ద్వారా స్ఫూర్తి పొంది మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని తెరకెక్కించారు.

    మోసగాళ్ళకు మోసగాడు మళ్ళీ రిలీజ్ 

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త చరిత్ర సృష్టించిన మోసగాళ్ళకు మోసగాడు చిత్రాన్ని ఇప్పుడు మళ్ళీ వెండితెర మీద చూసే అవకాశాన్ని తీసుకొస్తున్నారు. మే 31వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తున్నారు. 4k వెర్షన్ లో ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడవచ్చు. తాజాగా మోసగాళ్లకు మోసగాడు రిలీజ్ ట్రైలర్ ని మహేష్ బాబు విడుదల చేశారు. ఈ సినిమాలో విజయ్ నిర్మల, నాగభూషణం, రావు గోపాల రావు తదితరులు నటించారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తెలుగు సినిమా
    మహేష్ బాబు

    తెలుగు సినిమా

    ఎన్టీఆర్ రామారావు బర్త్ డే: దర్శకుడిగా ఎన్టీఆర్ తెరకెక్కించిన సినిమాలు  సినిమా
    దేవుళ్ళ రూపాల్లో తెరమీద కనిపించి తెలుగు ప్రేక్షకులకు దేవుడిగా మారిన ఎన్టీ రామారావు  సినిమా
    భార్యాభర్తలను విడదీయడమే గురూజీ స్పెషల్ అంటూ బండ్ల గణేష్ ట్వీట్  సినిమా
    SSMB 28 టైటిల్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్; అభిమానులు రెడీగా ఉండండి  మహేష్ బాబు

    మహేష్ బాబు

    తండ్రి మహేష్ బాబు బాటలో కూతురు సితార ఘట్టమనేని: బ్రాండ్ అంబాసిడర్ గా తొలి సంతకం  సినిమా
    మహేష్ 28వ సినిమా: అందరి చూపు ఆ టైటిల్ మీదే; సెంటిమెంటును త్రివిక్రమ్ దూరం పెడతాడా?  తెలుగు సినిమా
    అలియా భట్ పంపిన బహుమతితో మెరిసిపోతున్న మహేష్ బాబు కూతురు సితార  తెలుగు సినిమా
    SSMB28: మహేష్ బాబుకు ఆ విషయంలో పెద్ద ఫ్యాన్ : పూజా హెగ్డే త్రివిక్రమ్ శ్రీనివాస్
    తదుపరి వార్తా కథనం

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023