
Kalki release date: ప్రభాస్ 'కల్కి 2898 AD' మూవీ విడుదల ఆరోజే..
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియన్ స్టార్ 'ప్రభాస్' ఇటీవల 'సలార్: పార్ట్-1 సీస్‌ఫైర్' మూవీతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ మూవీ ఇంకా వసూళ్లను రాబడుతోంది.
ఇదే సమయంలో మరో సినిమాను విడుదల చేసే పనిలో ప్రభాస్ ఉన్నట్లు తెలుస్తోంది.
నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబినేష్‌లో తెరకెక్కుతున్న 'కల్కి 2898 AD' విడుదల తేదీపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది.
ఈ చిత్రాన్ని మే 9, 2024న విడుదల చేసేందుకు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ప్లామ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ అవుతోంది.
విడుదల తేదీని సంక్రాంతిని పురస్కరించుకొని జనవరి 12న ప్రకటిస్తారనే చర్చ నడుస్తోంది.
అయితే కల్కి టీమ్ నుంచి మాత్రం ఎలాంటి అధికార ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.
కల్కీ
భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌లో కల్కి
'Kalki 2898 AD' మూవీని భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌లో నిర్మిస్తున్నారు.
పౌరాణిక సైన్స్ ఫిక్షన్ డ్రామా కథాంశంతో నాగ్ అశ్విన్ దీన్ని తెరకెక్కిస్తున్నారు.
వాస్తనానికి ఈ మూవీ సంక్రాంతికి వీడుదల చేయాలని అనుకున్నా.. కానీ కుదరలేదు.
ఇప్పుడు వేసవి సెలవుల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, పశుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ మ్యూజిగ్ అందిస్తున్నారు.
కల్కిలో లోక్ నాయకుడు కమల్ హాసన్ విలన్ రోల్ పోషించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.