
Mothers Day Special: మదర్స్ డే స్పెషల్.. అమ్మ గొప్పతనాన్ని తెలిపిన పాటలు ఇవే..!
ఈ వార్తాకథనం ఏంటి
ఈ భూమిపై "అమ్మ" అన్న మాటకన్నా మధురమైన పదం మరొకటి లేదని ఎందరో కవులు తమ రచనల ద్వారా వెల్లడించారు.
సినారే గారు "అమ్మకు మించిన దైవం ఉన్నాదా?" అని అడుగుతూ, అమ్మను దైవానికి మించినవారిగా గౌరవించారు.
చంద్రబోస్ గారు "పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ" అంటూ, తల్లిని ప్రత్యక్ష దైవంగా వర్ణించారు.
అలాగే సిరివెన్నెల సీతారామశాస్త్రి "సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ" అంటూ తల్లిని సృష్టికి మూలంగా తీర్చిదిద్దారు.
ఇలాంటి భావాలు వింటూ, చదువుతూ ఉండగానే మన హృదయాల్లో మళ్లీ మళ్లీ కొత్తగా అనిపిస్తుంటుంది.
వివరాలు
అమ్మ పాటలు మన హృదయాల్లో అమరవాక్యాలుగా నిలుస్తాయి
ఈ లోకంలో మనసును తాకే భావాలలో, ప్రేమను నిలిపే నిధుల్లో తల్లిని మించేది మరొకటి లేదు.
అందుకే అమ్మ మీద వచ్చిన ఎన్నో పాటలు మన హృదయాల్లో అమరవాక్యాలుగా నిలుస్తాయి.
ఈ ఆదివారం(మే 11) మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని, వెండితెరపై అమ్మ పేరును మహిమనుచెప్పే, తల్లి గొప్పతనాన్ని గీతల ద్వారా ప్రదర్శించిన కొన్ని అపురూప గీతాలను ఓసారి గుర్తు చేసుకుందాం.
#1
20వ శతాబ్ధం
"అమ్మకు మించిన దైవం ఉన్నాదా?" అనే పాటను చెప్పకుండా మాతృస్మరణ మొదలవ్వదు. ఈ పాటకు సాహిత్యాన్ని అందించిన సి. నారాయణ రెడ్డి గారు తల్లి గొప్పతనాన్ని సారూప్యంగా, ఆవేదనగా రాశారు. ఈ పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల గారు హృద్యంగా ఆలపించారు.#2అమ్మ రాజీనామా
"ఎవరు రాయగలరు అమ్మ అనే మాట కన్న కమ్మని కావ్యం" అంటూ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం నుంచి వచ్చిన ఈ పాట తల్లిపై గాఢమైన భావాన్ని కలిగిస్తుంది. "అవతార మూర్తయిన అమ్మపేగు తెంచుకునే అంతటి వాడవుతాడు" అనే వాక్యం మాత్రమే కాక, మొత్తం పాటలో తల్లి పట్ల ఉండే అనురాగాన్ని అద్భుతంగా చెప్పారు.
#3
అమ్మ రాజీనామా
"సృష్టికర్త ఒక బ్రహ్మ... అతనిని సృష్టించినదొక అమ్మ" అనే వాక్యం అమ్మ రాజీనామా చిత్రంలో సిరివెన్నెల రాసిన మరో పాట. ఈ గీతాన్ని కే. జే. యేసుదాస్ స్వరపరిచారు. తల్లిని సృష్టికర్తకన్నా గొప్పదిగా చూపించిన ఈ పాట వినేవారిలో భావోద్వేగాన్ని కలిగిస్తుంది. #4నాని
"పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ... కదిలే దేవత అమ్మ" అంటూ చంద్రబోస్ గారు తల్లిని ప్రత్యక్షంగా కదిలే దైవంగా వర్ణించారు. ఈ పాటకు ఏ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చరు. ఈ పాట ఎన్నిసార్లు విన్నా కూడా బోర్ కొట్టదు.
#5
అమ్మ , నాన్న ఓ తమిళ అమ్మాయి
"జన్మిస్తే మళ్లీ నీవై పుడతాలే... ధన్యోస్మీ అంటూ దణ్ణం పెడతానే" సృష్టిలో అమ్మ పాత్ర ఎలాంటిదో ఈ పాటలో చక్కగా వర్ణించారు.. రచయిత పెద్దాడ మూర్తి గారు. "కనిపించకపోతే బెంగై వెతికేవే... కన్నీరు వస్తే కొంగై తుడిచావే" అనే మాటలతో తల్లి ప్రేమను అద్భుతంగా వ్యక్తీకరించారు. #6కె.జి.యఫ్
"ఎదగర ఎదగర దినకర... జగతికే జ్యోతిగా నిలవరా" అనే పాటలో రామజోగయ్య శాస్త్రి గారు తల్లి దృష్టిలో కొడుకు ఎలా ఉండాలో స్పష్టంగా చెప్పారు. తల్లికి తన కొడుకు ప్రపంచానికి వెలుగులా ఉండాలని, గొప్ప మనిషిగా ఎదగాలని కల ఉంటుందని ఈ పాట తెలియజేస్తుంది.
#7
ఒకే ఒక జీవితం
"నీ పాదాలకు మువ్వల్లా నా అడుగులు సాగాలమ్మా... నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా" అనే పాట తల్లి ప్రేమను కోల్పోయిన కొడుకు హృదయాన్ని హత్తుకుంటుంది.
మళ్లీ ఆ ప్రేమను పొందే అవకాశం దక్కితే ఎంత ఆనందంగా ఉంటుందో అని సిరివెన్నెల గారు గంభీరంగా వర్ణించారు.
ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించగా వినిపించే ప్రతి సారి మనసు తల్లి సన్నిధిలోకి వెళ్తుంది.
ఇవే కాకుండా తెలుగు సినిమాల్లో తల్లిపై ఎన్నో శ్రేష్ఠమైన పాటలు ఉన్నాయి. అవి మన మనసును తాకుతూ, తల్లిపట్ల మన కృతజ్ఞతను మరింత బలపరుస్తుంటాయి.