Loading...
Thella kagitham: మరో మూడు రోజుల్లో సినిమా రిలీజ్‌.. ఆన్‌లైన్‌లో 'తెల్లకాగితం' కంటెంట్‌ లీక్‌!
మరో మూడు రోజుల్లో సినిమా రిలీజ్‌.. ఆన్‌లైన్‌లో 'తెల్లకాగితం' కంటెంట్‌ లీక్‌!

Thella kagitham: మరో మూడు రోజుల్లో సినిమా రిలీజ్‌.. ఆన్‌లైన్‌లో 'తెల్లకాగితం' కంటెంట్‌ లీక్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 29, 2026
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

హర్ష్‌ రోషన్‌, నక్షత్ర జంటగా నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎమోషనల్‌ మూవీ 'తెల్లకాగితం'. రమేశ్‌ బండ్రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. అక్టోబరు 2న (Thella Kagitham release date) 'తెల్లకాగితం' థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన కీలక కంటెంట్‌ ఆన్‌లైన్‌లో అనుమతి లేకుండా విడుదల కావడం కలకలం రేపింది. ఈ వ్యవహారంపై చిత్ర నిర్మాణ సంస్థ అరుణాచల క్రియేషన్స్‌ ఎక్స్‌ వేదికగా స్పందించింది. 'మా 'తెల్లకాగితం' చిత్రానికి సంబంధించిన కంటెంట్‌ను అనుమతి లేకుండా ప్రచారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది.

వివరాలు

థియేటర్లలోనే వీక్షించాలి

క్రియేటర్‌ స్టూడియో సినిమాకు సంబంధించిన కంటెంట్‌ను చట్టవిరుద్ధంగా లీక్‌ చేయడాన్ని, షేర్‌ చేయడాన్ని, ప్రచారం చేయడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాము.

లీకైన కంటెంట్‌ను డౌన్‌లోడ్‌ చేయడం, షేర్‌ చేయడం, తిరిగి పోస్ట్‌ చేయడం లేదా ఎలాంటి రూపంలోనూ ప్రచారం చేయొద్దని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాం.

'తెల్లకాగితం' చిత్రాన్ని కేవలం థియేటర్లలోనే వీక్షించి, మా చిత్ర బృందానికి మీ మద్దతును అందించాలని ప్రేక్షకులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని చిత్రబృందం ఎక్స్‌ వేదికగా పేర్కొంది.

ఇప్పటికే 'తెల్లకాగితం' సినిమాను ఇండస్ట్రీలో పలువురు దర్శకులు, నిర్మాతలకు చూపించారు.

వివరాలు

ఓవర్సీస్‌ ఫుటేజ్‌ నుంచి లీకైనట్లు సమాచారం

వారి నుంచి సినిమాకు పాజిటివ్‌ స్పందన రావడంతో బిజినెస్‌ పరంగానూ చిత్రానికి క్రేజ్‌ ఏర్పడింది.

ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

దీంతో చిత్రబృందం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఓవర్సీస్‌ ఫుటేజ్‌ నుంచి ఈ కంటెంట్‌ లీక్‌ అయినట్లు సమాచారం.

ఇప్పటికే సోషల్‌ మీడియాలో బయటకు వచ్చిన సన్నివేశాలను తొలగించేందుకు చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోంది.

అక్టోబరు 2న సినిమా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో కంటెంట్‌ లీక్‌ కావడం చిత్రబృందానికి ఆందోళన కలిగిస్తోంది.

ADVERTISEMENT