Page Loader
upcoming movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు 
ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు

upcoming movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 15, 2024
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతీ వారంలాగే బాక్సాఫీస్‌ వద్ద ఈసారి వేసవికాలం వినోదాల జోరు కొనసాగుతోంది. ఈ వారం కూడా బాక్సాఫీస్‌ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటిటిలో కూడా పలు చిత్రాలు అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ వారం థియేటర్‌/ఓటిటిలో విడుదలయ్యే సినిమాలేంటో చూసేయండి. ముందుగా ఏ సినిమా ఏఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదల అవుతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. నెట్‌ఫ్లిక్స్‌ ఎనీవన్‌ బట్‌ యూ (హాలీవుడ్‌) ఏప్రిల్‌ 15 రెబల్‌ మూన్‌ 2 (హాలీవుడ్‌) ఏప్రిల్‌ 19 డిస్నీ+ హాట్‌స్టార్‌ చీఫ్‌ డిటెక్టివ్‌ 1958 (కొరియన్‌) ఏప్రిల్‌ 19 సైరన్‌ (తెలుగు) ఏప్రిల్‌ 19 ఆహా మై డియర్‌ దొంగ (తెలుగు) ఏప్రిల్‌ 19

Details 

ఓటిటి లో విడుదల అవుతున్న సినిమాలు ఇవే..

బుక్‌ మై షో డ్యూన్‌ (హాలీవుడ్) ఏప్రిల్‌ 19 లయన్స్‌ గేట్‌ ప్లే డ్రీమ్‌ సినారియో (హాలీవుడ్‌) ఏప్రిల్‌ 19 ద టూరిస్ట్‌ (వెబ్‌సిరీస్‌2) ఏప్రిల్‌ 19 జియో సినిమా పొన్‌ ఒండ్రు కేంద్రేన్‌ (తమిళ) ఏప్రిల్‌ 14 ది సింపథైజర్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 14 ఆర్టికల్‌ 370 (హిందీ) ఏప్రిల్‌ 19

Details 

ఈ వారం థియేటర్‌ లో విడుదలయ్యే సినిమాలు 

'పారిజాత పర్వం' : సంతోష్‌ కంభంపాటి దర్శకత్వంలో చైతన్య రావు, సునీల్‌, శ్రద్ధా దాస్‌, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 'శరపంజరం' : నవీన్‌ కుమార్‌ గట్టు హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 19న థియేటర్‌లలో విడుదల కాబోతుంది. మార‌ణాయుధం' : మాలాశ్రీ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో రూపొందిన చిత్రం 'మార‌ణాయుధం'. ఏప్రిల్‌ 19న ఈ సినిమా థియేటర్‌లలో విడుదల కానుంది. లవ్‌ యూ శంకర్‌': శ్రేయాస్‌ తల్పాడే, తనీషా ముఖర్జీ జంటగా నటించారు. ఏప్రిల్‌ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.