NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / మిస్టర్ ప్రెగ్నెంట్ రివ్యూ: హీరో సోహైల్ కు హిట్ దొరికిందా? 
    తదుపరి వార్తా కథనం
    మిస్టర్ ప్రెగ్నెంట్ రివ్యూ: హీరో సోహైల్ కు హిట్ దొరికిందా? 
    మిస్టర్ ప్రెగ్నెంట్ రివ్యూ

    మిస్టర్ ప్రెగ్నెంట్ రివ్యూ: హీరో సోహైల్ కు హిట్ దొరికిందా? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 18, 2023
    03:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నటీనటులు: సోహైల్, రూపా కొడవాయుర్, సుహాసిని మణిరత్నం, తదితరులు

    దర్శకుడు : శ్రీనివాస్ వింజనంపాటి

    నిర్మాతలు: అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి

    సంగీతం: శ్రవణ్ భరధ్వాజ్

    కథ:

    హీరో గౌతమ్ (సోహైల్) ఒక అనాథ. పెద్దయ్యాక టాటూ ఆర్టిస్ట్ గా స్థిరపడతాడు. అతన్ని మహీ రూపా కొడవాయుర్ చిన్నప్పటి నుండి ప్రేమిస్తూ ఉంటుంది. తనను పెళ్లి చేసుకుంటానని చెబుతుంది. దానికి గౌతమ్ ఒప్పుకుంటాడు కానీ పిల్లల్ని కనకూడదని కండిషన్ పెడతాడు.

    కొన్ని రోజుల తర్వాత మహి ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ టైంలో గౌతమ్ ఏం చేశాడు? అతనికి ప్రెగ్నెంట్ ఎలా వచ్చింది? చివరికి సక్సెస్ ఫుల్ గా డెలివరీ అయ్యిందా లేదా అనేది మిగిలిన కథ.

    Details

    సినిమా ఎలా ఉందంటే? 

    మిస్టర్ ప్రెగ్నెంట్(Mr Pregnant) కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా. మగవాళ్లకు ప్రెగ్నెన్సీ వస్తే ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో చూపించారు. కాన్సెప్ట్ పరంగా కొత్తగా ఉన్నప్పటికీ ఇందులో సన్నివేశాలు వేగంగా కదలవు.

    నెరేషన్ స్లోగా సాగుతుంది. ఈ సినిమాలో హీరోగా సోహెల్ చాలా చక్కగా కనిపించాడు. అతని సంభాషణలు కూడా బాగున్నాయి. తెరమీద హీరోయిన్ బాగానే ఉన్నప్పటికీ ఆమెకు పెద్దగా ప్రాధాన్యం ఉన్నట్టు కనిపించదు.

    ఫస్టాఫ్ లో స్లో నెరేషన్, సెకండ్ హాఫ్ లో రొటీన్ సన్నివేశాలు ప్రేక్షకుడికి కొంత ఇబ్బందిని కలగచేస్తాయి.

    Details

    ఎవరెలా చేశారంటే? 

    ముందే చెప్పినట్టు హీరోగా సోహెల్ తన పరిధి మేరకు చక్కగా నటించాడు. హీరోయిన్ రూప కొడవయూర్ పర్వాలేదనిపించింది. ఇంకా మిగిలిన నటీనటుల్లో సుహాసిని మణిరత్నం తన పాత్ర పరిధి మేరకు మెప్పించారు.

    పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా నేపథ్య సంగీతం బాగా ఆకర్షిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. తెరమీద హై క్వాలిటీ సినిమా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. కెమెరామెన్ పనితనం మెచ్చుకోవాల్సిందే.

    ఓవరాల్ గా చూస్తే మిస్టర్ ప్రెగ్నెంట్ అక్కడక్కడ సాగదీతగా ఉన్న కొన్ని సీన్లు మనసుకు నచ్చుతాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మూవీ రివ్యూ

    తాజా

    Stairs Climbing Benefits: లిఫ్ట్‌కు గుడ్ బై చెప్పండి.. మెట్లు ఎక్కండి.. ఫిట్‌గా ఉండండి! జీవనశైలి
    Gateway To Hell : యాభై ఏళ్ల మంటలకు బ్రేక్‌.. తుర్క్‌మెనిస్తాన్‌లో 'గేట్‌వే టు హెల్' ఆగిపోయింది!  ప్రపంచం
    Manipur violence: మణిపూర్‌ను మళ్లీ కుదిపేసిన అల్లర్లు.. ఆ జిల్లాలో కర్ఫ్యూ! మణిపూర్
    Vatican City: ప్రపంచంలో విరాళాలతో నడిచే ప్రపంచపు మినీ దేశం.. అది ఎక్కడుందో తెలుసా? ప్రపంచం

    మూవీ రివ్యూ

    ప్రేక్షకుల మనసు దోచని 'శ్రీదేవి శోభన్ బాబు' సినిమా
    మూవీ రివ్యూ: ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా రిలీజ్
    దసరా ట్విట్టర్ రివ్యూ: బద్దల్ బాశింగాల్ అయినట్టేనా దసరా మూవీ
    రావణాసుర రివ్యూ: రవితేజ థ్రిల్ చేసాడా? రవితేజ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025