Mrunal-Dhanush : ఫిబ్రవరి 14న పెళ్లి అంటూ ప్రచారం.. ధనుష్‌తో రూమర్లపై మృణాల్ టీమ్ క్లారిటీ
ఈ వార్తాకథనం ఏంటి
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్లకు సంబంధించి డేటింగ్, పెళ్లి వార్తలు రావడం కొత్త విషయం కాదు. కలిసి సినిమా చేయకపోయినా, ఒకే వేదికపై కనిపించినా లేదా ఒకే పార్టీలో పాల్గొన్నా వెంటనే రిలేషన్‌షిప్ కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం పరిపాటిగా మారింది. తాజాగా ఇదే తరహా రూమర్లు 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ను చుట్టుముట్టాయి. కొన్ని రోజులుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ధనుష్ హాజరైన కొన్ని బాలీవుడ్ పార్టీల్లో మృణాల్ కనిపించడం, అలాగే మృణాల్ నటిస్తున్న 'సన్ ఆఫ్ సర్దార్ 2' ఈవెంట్‌కు ధనుష్ హాజరవడం వంటి సంఘటనలు ఈ రూమర్లకు మరింత బలం చేకూర్చాయి.
Details
ఫిబ్రవరి 20న 'దో దీవానే సెహెర్ మే' రిలీజ్
ఈ క్రమంలోనే ఫిబ్రవరి 14న, అంటే వాలెంటైన్స్ డే రోజే వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో సెన్సేషనల్ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ పెళ్లి ప్రచారాలపై మృణాల్ ఠాకూర్ టీమ్ స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. 'వచ్చే నెలలో మృణాల్ వివాహం చేసుకుంటుందనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఆమె ప్రస్తుతం పూర్తిగా తన కెరీర్‌పైనే దృష్టి పెట్టింది' అని ఆమె పీఆర్ టీమ్ వెల్లడించింది. అదేవిధంగా, ఫిబ్రవరి 20న మృణాల్ నటించిన బాలీవుడ్ చిత్రం 'దో దీవానే సెహెర్ మే' విడుదలకు సిద్ధంగా ఉంది.
Details
పెళ్లి వార్తలకు పుల్ స్టాప్
ఆ తర్వాత మార్చి నెలలో అడివి శేష్‌తో కలిసి నటిస్తున్న 'డెకాయిట్' (Dacoit) సినిమా షూటింగ్‌లో ఆమె బిజీగా ఉండనుంది. ఇంత బిజీ షెడ్యూల్ మధ్య పెళ్లి ప్రస్తావనే లేదని, ఇవన్నీ ఆధారాలు లేని రూమర్లేనని టీమ్ తేల్చి చెప్పింది. దీంతో గత కొద్ది రోజులుగా నెట్టింట హల్‌చల్ చేసిన ఈ క్రేజీ గాసిప్‌కు పూర్తిగా తెరపడినట్లైంది.