LOADING...
Rashmika deepfake video: రష్మిక డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన నాగ చైతన్య, మృణాల్ ఠాకూర్ 

Rashmika deepfake video: రష్మిక డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన నాగ చైతన్య, మృణాల్ ఠాకూర్ 

వ్రాసిన వారు Stalin
Nov 07, 2023
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియోపై సినీ ప్రముఖలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. AIని ఉపయోగించి, డీప్‌ఫేక్ సాంకేతిక సాయంతో వీడియోలో రష్మిక ఫేస్‌ను మార్ఫింగ్ చేశారు. తాజాగా రష్మికకు మద్దతుగా నాగ చైతన్య, మృణాల్ ఠాగూర్ స్పందించారు. 'టెక్నాలజీని ఇలా దుర్వినియోగం నిజంగా నిరాశపరిచింది. భవిష్యత్తులో దాని ప్రభావం ఎలా ఉంటుందో ఆలోచిస్తుంటేనే భయానకంగా ఉంది' అంటూ ట్విట్టర్‌లో నాగ చైతన్య రాసుకొచ్చాడు. అలాగే ఈ సమస్యను పరిష్కరించాలని, దీనిపై చట్టాన్ని తీసుకురావాలని ఆయన అభిప్రాయపడ్డాడు. మృనాల్ తన ఇన్‌స్టా స్టోరీపై ఇలా రాశారు. 'ఇలాంటి పనులు చేసే వారికి సిగ్గుపడాలి. వారిలో మనస్సాక్షి మిగిలి లేదనిపిస్తుంది. ఈ విషయంపై మాట్లాడినందుకు రష్మికకు ధన్యవాదాలు' అని పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నాగ చైతన్య ట్వీట్

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియోపై క్లారిటీ