నాని 30 హీరోయిన్ కు అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్?
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. పుష్ప 2 సినిమాను ప్రేక్షకులు ఎవ్వరూ ఊహించని రీతిలో చూపించడానికి సుకుమార్ చాల గట్టిగా పనిచేస్తున్నాడని అంటున్నారు. ఇటీవల రిలీజైన పుష్ప 2 కాన్సెప్ట్ టీజర్ చూస్తే ఈ విషయం అర్థమైఫొయింది. 3నిమిషాల టీజర్ ని అత్యంత ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ఈ టీజర్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. కాన్సెప్ట్ టీజర్ తో పుష్ప 2పై జనాల ఆకర్షణను పెంచేసాడు సుకుమార్. ఐతే పుష్ప 2 టీజర్ గురించి జనాలు మాట్లాడుకుంటున్న ఇదే టైమ్ లో అల్లు అర్జున్ తర్వాతి సినిమా గురించి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ చేస్తుందని అంటున్నారు.
త్వరలో రానున్న అధికారిక సమాచారం
సీతారామం సినిమాలో సీత పాత్రలో కనిపించిన మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకుంది. సీతారామం తర్వాత నాని 30 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా, అల్లు అర్జున్ కాంబోలో రూపొందే సినిమాలోనూ మృణాల్ ఠాకూర్ కనిపించనుందని అంటున్నారు. మృణాల్ ఠాకూర్ తో చర్చలు పూర్తయ్యాయని ఆల్ మోస్ట్ ఫిక్స్ ఐపోయినట్లేనని చెబుతున్నారు. మరి ఈ విషయమై అధికారిక సమాచారాన్ని ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి. పుష్ప 2 పూర్తికాగానే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోని సినిమా మొదలవుతుందట. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి భూషణ్ కుమార్ నిర్మాతగా ఉన్నారు.