
పుష్ప 2 కాన్సెప్ట్ వీడియో: జైలు నుండి తప్పించుకున్న అల్లు అర్జున్
ఈ వార్తాకథనం ఏంటి
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప 2 నుండి ఒక చిన్నపాటి వీడియో రిలీజైంది. 20సెకన్లు ఉన్న ఈ వీడియోలో, జైల్ లోంచి అల్లు అర్జున్ తప్పించుకున్నట్లు, పోలీసులు పుష్ప కోసం వెతుకుతున్నట్లు చూపించారు.
పుష్ప 2 కథ 2004లో జరుగుతున్నట్లుగా ఈ వీడియోలో తెలియజేసారు. ఎర్రచందనం స్మగ్లింగ్ సామ్రాజ్యంలో తిరుగులేని శక్తిగా పైకి వచ్చిన పుష్పను మొదటి భాగంలో చూసాం.
స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని ఏలే వ్యక్తిగా రెండవ భాగంలో కనిపించనున్నాడు పుష్ప. దానికంటే ముందే అరెస్ట్ అవుతాడని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
ఈ వీడియోకు హంట్ బిఫోర్ ద రూల్ అంటూ మేకర్స్ పెట్టిన క్యాప్షన్ ప్రకారం, జైల్ లోంచి తప్పించుకుపోయిన తర్వాత స్మగ్లింగ్ సామ్రాజ్యాని ఏలుతాడని తెలుస్తోంది.
అల్లు అర్జున్
వీడియోలో కనిపించని అల్లు అర్జున్
జైల్ లోంచి తప్పించుకోవడంతో విలన్ తో మరింత వైరం పెరగనుందని తెలుస్తోంది. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయ్యే వీడియోలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.
మొత్తానికి పుష్ప అభిమానులకు సరైన అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 8వ తేదీన వచ్చే అప్డేట్ మరింత సాలిడ్ గా ఉండనుందని అర్థమవుతోంది.
ఇకపోతే ఇప్పుడు రిలీజ్ చేసిన వీడియోలో అల్లు అర్జున్ ఎక్కడా కనిపించలేదు. చీకట్లో బైక్ మీద పారిపోతున్నట్టు చూపించారే తప్ప ముఖాన్ని సరిగ్గా కనబడనీయలేదు. మరి 8వ తేదీ రోజైనా రివీల్ చేస్తారేమో చూడాలి.
సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప సినిమాకు మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పుష్ప 2 కాన్సెప్ట్ వీడియో రిలీజ్
#WhereIsPushpa ?
— Mythri Movie Makers (@MythriOfficial) April 5, 2023
The search ends soon!
- https://t.co/AOrOGEoyPD
The HUNT before the RULE 🪓
Reveal on April 7th at 4.05 PM 🔥#PushpaTheRule ❤️🔥
Icon Star @alluarjun @iamRashmika #FahadhFaasil @aryasukku @ThisIsDSP @SukumarWritings @PushpaMovie pic.twitter.com/djm4ClLeHg