Loading...
Bollywood: టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పులు.. సినీ ప్రముఖులకు పోలీసుల హెచ్చరిక
టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పులు.. సినీ ప్రముఖులకు పోలీసుల హెచ్చరిక

Bollywood: టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పులు.. సినీ ప్రముఖులకు పోలీసుల హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 10, 2026
01:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పులు జరిగిన ఘటనతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. సినీ ప్రముఖులు బహిరంగ ప్రదేశాల్లో జనసమూహాల మధ్యకు వెళ్లవద్దని సూచించారు. అభిమానులను కలిసే సమయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రముఖుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ సూచనలు జారీ చేసినట్లు ఓ సీనియర్‌ పోలీసు అధికారి వెల్లడించారు. కొన్ని వారాల క్రితం ముంబైలో టైగర్‌ ష్రాఫ్‌ కారుపై దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం పలువురు సినీ ప్రముఖుల ఇళ్ల వద్ద కూడా కొందరు వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమై సినీ ప్రముఖులకు భద్రతాపరమైన సూచనలు జారీ చేశారు.

వివరాలు 

బాలీవుడ్‌ ప్రముఖులకు బెదిరింపుల నేపథ్యంలో భద్రతపై దృష్టి

ఇటీవల బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ జుహులోని తన నివాసం 'జల్సా' వెలుపల అభిమానులకు అభివాదం చేశారు.

అయితే ఈ సందర్భంగా ఆయన బుల్లెట్‌ ప్రూఫ్‌ అద్దం వెనుక ఉండి అభిమానులకు అభివాదం చేయడం గమనార్హం.

మరోవైపు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటున్న కొందరు వ్యక్తుల నుంచి పలువురు బాలీవుడ్‌ ప్రముఖులకు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.

ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని నటీనటులు తమ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని ముంబై పోలీసులు సూచించారు.

ADVERTISEMENT