Nandamuri Balakrishna: తమన్ కు అదిరిపోయే గిఫ్ట్.. ఇది కదా బాలయ్య అంటే..
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ, సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.
వీరి కలయికలో వచ్చిన అనేక చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. బాలయ్య సినిమాలకు తమన్ అందించే సంగీతం ఎప్పుడూ ప్రత్యేకమైన రేంజ్‌లో ఉంటుంది.
థియేటర్లలో ఆయన మ్యూజిక్‌కు అభిమానులు ఊగిపోతారు. సినిమాలకు మాత్రమే కాకుండా, వ్యక్తిగతంగా కూడా బాలకృష్ణ, తమన్ మధ్య మంచి సంబంధం ఉంది.
బాలయ్య అభిమానులు తమన్‌ను "నందమూరి తమన్" అంటూ పిలుస్తూ సోషల్ మీడియాలో ఆయనపై తమ అభిమానాన్ని చూపిస్తుంటారు.
ఈ నేపథ్యంలో,'డాకు మహారాజ్'విజయోత్సవ వేడుకల్లో బాలకృష్ణ స్వయంగా తమన్‌కు ఒక కొత్త పేరు పెట్టారు. "నందమూరి తమన్ కాదు.. ఎన్బీకే తమన్!" అని ఆయన ముద్దు పేరు పెట్టారు.
వివరాలు
సోషల్ మీడియాలో వైరల్
తాజాగా, బాలయ్య తమన్‌కు ఖరీదైన కారును బహుమతిగా అందించారు. ఈ కారు అందిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఆ కారు విలువ కోటికి పైగానే ఉంటుందని భావిస్తున్నారు.
ఇప్పటి వరకు బాలకృష్ణ-తమన్ కాంబినేషన్‌లో 'అఖండ', 'వీర సింహారెడ్డి', 'భగవంత్ కేసరి', 'డాకు మహారాజ్' చిత్రాలు వచ్చాయి.
ఈ సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధించాయి. ప్రస్తుతం బాలయ్య 'అఖండ 2' చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
ఈ చిత్రానికి కూడా తమన్ స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే తమన్ ఒక సందర్భంలో "అఖండ 2 విడుదలైన థియేటర్లలో స్పీకర్లు కుదేలవుతాయి" అంటూ తన ఆసక్తిని వ్యక్తం చేశారు.
వివరాలు
దసరా కానుకగా 'అఖండ 2'
'అఖండ 2' చిత్రాన్ని 'అఖండ'సీక్వెల్‌గా రూపొందిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో సంయుక్త కథానాయికగా నటిస్తోంది.
తేజస్విని నందమూరి సమర్పణలో, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.
దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.