Page Loader
SS Taman : సంగీతం సంచలనం.. నేడు స్టార్ మ్యూజిక్ డైరక్టర్ తమన్ బర్త్ డే 
సంగీతం సంచలనం.. నేడు స్టార్ మ్యూజిక్ డైరక్టర్ తమన్ బర్త్ డే

SS Taman : సంగీతం సంచలనం.. నేడు స్టార్ మ్యూజిక్ డైరక్టర్ తమన్ బర్త్ డే 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 16, 2023
03:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరక్టర్‌గా ఎస్.ఎస్. తమన్ దూసుకెళ్తున్నారు. నటుడిగా ఎంట్రీ ఇచ్చి మ్యూజిక్ డైరక్టర్‌గా ఎన్నో విజయాలను అందుకున్నారు. టాలీవుడ్ అగ్రహీరోలందరికీ సంగీతం అందించాడు. ఇవాళ తమ బర్త్ డే సందర్భంగా ఆయన సాధించిన విజయాల గురించి తెలుసుకుందాం. తమన్ అసలు పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్. నిర్మాత ఘంటసాల బాలరామయ్య మనవడు. ఇక తమన తండ్రి శివకుమార్ ఏకంగా 700 సినిమాలకు డ్రమ్మర్‌గా పనిచేశారు. తమన్ మొదటగా బాయ్స్ సినిమాలో నటించారు. తర్వాత సంగీతాన్ని కెరీర్‌గా మలుచుకున్నారు.

Detais

హిట్ సాంగ్స్ పాడిన తమన్

రాజ్-కోటి, వందేమాతరం శ్రీనివాస్, చక్రి, ఆర్పీ.పట్నాయక్, దేవిశ్రీ ప్రసాద్ వంటి ప్రముఖ సంగీత దర్శకుల వద్ద కీబోర్డు ప్లేయర్‌గా తమన్ పనిచేసిన అనుభవం ఉంది. తమన్ అనేక సినిమాల్లో పాటలు కూడా పాడారు. 2008లో తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన మొదటి సినిమా 'మళ్లీ మళ్లీ'. ఆ తర్వాత 2010లో రవితేజ 'కిక్' సినిమాకి మ్యూజిక్ ని అందించారు. మిరపకాయ్ సినిమాలో వైశాలి వైశాలి, ఆగడు నారీ నారీ, బిజినెస్ మేన్‌లో సారొస్తారా, బలుపులో కాజల్ చెల్లివా వంటి హిట్ సాంగ్స్ తమన్ పాడారు. ప్రస్తుతం తమన్ చేతిలో 'గుంటూరు కారం, గేమ్ ఛేంజర్, ఓజీ, రవితేజ-మలినేని' ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.