LOADING...
Samantha: నా బిడ్డే నా సర్వస్వం.. సమంత ఎమోషనల్ కామెంట్స్ వైరల్
నా బిడ్డే నా సర్వస్వం.. సమంత ఎమోషనల్ కామెంట్స్ వైరల్

Samantha: నా బిడ్డే నా సర్వస్వం.. సమంత ఎమోషనల్ కామెంట్స్ వైరల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 22, 2026
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

నటి సమంత ప్రస్తుతం కెరీర్‌, వ్యక్తిగత జీవితంలో ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె నటించిన 'మా ఇంటి బంగారం' చిత్రం ఘన విజయాన్ని అందుకోవడంతో పాటు, ఆమె తల్లి కాబోతున్నారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో సమంత గతంలో తనకు పుట్టబోయే పిల్లల గురించి చేసిన వ్యాఖ్యలు మళ్లీ వైరల్ అవుతున్నాయి. కొన్నేళ్ల క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత తల్లితనంపై తన ఆలోచనలను పంచుకున్నారు. "నా బిడ్డే నా ప్రపంచం అవుతుంది. ఉద్యోగం చేస్తూనే పిల్లలను, ఇంటి బాధ్యతలను సమర్థంగా నిర్వహించే మహిళలంటే నాకు ఎంతో గౌరవమని ఆమె చెప్పారు.

వివరాలు

బాల్యంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను

అదే ఇంటర్వ్యూలో తన చిన్ననాటి జీవితాన్ని గుర్తు చేసుకుంటూ సమంత భావోద్వేగానికి గురయ్యారు. "నా బాల్యంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. అలాంటి అనుభవాలు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు సౌకర్యవంతమైన, విలాసవంతమైన జీవితాన్ని అందించాలని కోరుకుంటారు. నేను కూడా అదే భావనతో ఉన్నాను. నా బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు అతడిని లేదా ఆమెను వదిలి ఎక్కడికీ వెళ్లను. నా బిడ్డే నా సర్వస్వం అవుతాడని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన 'మా ఇంటి బంగారం' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సమంత బేబీ బంప్‌తో కనిపించినట్లు సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.

వివరాలు

మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి 'మా ఇంటి బంగారం'

ఈ విషయంపై ఆమె సన్నిహిత వర్గాలను ప్రశ్నించగా, సమంత మరియు రాజ్ జీవితంలో ఇది ఎంతో ప్రత్యేకమైన దశ అని, కొత్త ప్రయాణానికి వారు సిద్ధమవుతున్నారని తెలిపినట్లు సమాచారం. దీంతో త్వరలోనే సమంత తన గర్భధారణకు సంబంధించిన గుడ్‌న్యూస్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే రూ.28 కోట్ల వసూళ్లు సాధించి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఉత్తర అమెరికా మార్కెట్‌లో ఈ చిత్రం వన్ మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. సోషల్ మీడియాలో కూడా ఈ చిత్రానికి సంబంధించిన రీల్స్, వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Advertisement

వివరాలు

సమంతకు నయనతార అభినందనలు

'మా ఇంటి బంగారం' విజయంతో అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా సమంతకు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా నటి నయనతార సోషల్ మీడియా వేదికగా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. "సామ్‌, నీ కోసం చాలా సంతోషంగా ఉంది. ఈ విజయానికి నువ్వు పూర్తిగా అర్హురాలివి" అంటూ ఆమె పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన సమంత.. 'డార్లింగ్ నయన్' అంటూ హార్ట్ ఎమోజీలతో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Advertisement