Page Loader
Maruthi: నాన్న అరటిపళ్లు అమ్మిన థియేటర్‌ వద్దే నా కటౌట్‌ : మారుతి ఎమోషనల్‌ పోస్ట్‌
నాన్న అరటిపళ్లు అమ్మిన థియేటర్‌ వద్దే నా కటౌట్‌ : మారుతి ఎమోషనల్‌ పోస్ట్‌

Maruthi: నాన్న అరటిపళ్లు అమ్మిన థియేటర్‌ వద్దే నా కటౌట్‌ : మారుతి ఎమోషనల్‌ పోస్ట్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2025
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'ది రాజా సాబ్‌' చిత్రం టీజర్‌ సోమవారం విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి భావోద్వేగంతో కూడిన పోస్ట్‌ను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ఒకప్పుడు తండ్రి అరటిపళ్లు విక్రయించిన స్థలంలో ఇప్పుడు తన చిత్రం కటౌట్‌ చూడటం ఎంతో ఆనందాన్ని కలిగించిందని వెల్లడించారు. 'మచిలీపట్నం - సిరి కాంప్లెక్స్‌(అప్పట్లో కృష్ణకిషోర్‌ కాంప్లెక్స్‌).. ఇక్కడే మా నాన్న చిన్న కిరాణా షాపులో అరటిపళ్లు అమ్మేవారు. ఆ రోజుల్లో అక్కడ రిలీజ్‌ అయ్యే సినిమాల పోస్టర్లు, బ్యానర్లను నేనే సిద్ధం చేసేవాడిని. 'ఒక్కసారి మన పేరు కూడా ఇక్కడ కనిపించాలని' కలలు కనేవాడిని. ఈరోజు అదే ప్రదేశంలో నా కటౌట్‌ ప్రభాస్ తో పాటు కనిపించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.

Details

డిసెంబర్ 5న 'ది రాజాసాబ్' రిలీజ్

అంతేకాక 'ఈరోజు నా నాన్న ఉన్నట్లయితే ఎంతో గర్వపడేవారు. ఆయనను చాలా మిస్‌ అవుతున్నాను. మీ అందరి ప్రేమకు, మద్దతుకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. డార్లింగ్ ప్రభాస్‌ను ఎలా చూపించాలని కలలు కన్నానో, ఆ కలలను మీ ముందుంచేందుకు ఎంతో కృషి చేస్తున్నాను. మీ ఆశీస్సులు కావాలని భావోద్వేగంగా పేర్కొన్నారు. 'ది రాజా సాబ్‌' ఒక రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రంగా తెరకెక్కుతోంది. ఇందులో మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌, సంజయ్ దత్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని తమన్ అందిస్తుండగా, ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హారర్ నేపథ్యానికి ప్రభాస్‌ తొలిసారి నటిస్తున్నందున, ఈ సినిమాపై అభిమానుల ఆసక్తి మరింత పెరిగింది.