
Manchu Vishnu : నా భార్యకు ఓపిక లేదు.. మరో పెళ్లి చేసుకోమంది.. మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
మంచు విష్ణు హీరోగా టాలీవుడ్‌లో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. తన కెరీర్‌లో మంచి హిట్ సినిమాలు ఉన్నా ప్రత్యేకమైన మార్కెట్‌ను మాత్రం స్థాపించుకోలేకపోయాడు.
ప్రస్తుతం 'కన్నప్ప' అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా, వచ్చే నెల 25న అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు ప్రొమోషన్ కార్యక్రమాల్లో బిజీగా మారిపోయాడు.
Details
మంచు విష్ణు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఆయన తన భార్య, పిల్లల గురించి ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నాడు.
మంచు విష్ణు మాట్లాడుతూ తనకు పిల్లలంటే చాలా ఇష్టమని, ఇప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు. వాళ్లతో గడిపే సమయం నాకు అద్భుతంగా అనిపిస్తుందన్నారు.
నా భార్య విరానికాను ఇంకొంత మంది పిల్లలు కావాలని అడిగితే, ఆమె 'తనకు ఓపిక లేదు, నీకు ఇంకా పిల్లలు కావాలంటే వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని చెప్పిందని చెప్పాడు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా, ఆయన పిల్లలు కూడా 'కన్నప్ప' చిత్రంలో కీలక పాత్రలు పోషించడం విశేషం.