మలయాళంలోకి ఎంట్రీ ఇస్తున్న మైత్రీ మూవీ మేకర్స్: టోవినో థామస్ హీరోగా సినిమా స్టార్ట్
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫామ్ లో ఉన్న నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు.
శ్రీమంతుడు నుండి మొదలుకుని పుష్ప వరకు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్లను అందించింది ఈ సంస్థ. తెలుగులో విజయ కేతనాన్ని ఎగరవేస్తున్న మైత్రీ, తాజాగా మలయాళం సినిమాలో ఎంట్రీ ఇస్తోంది.
తమ మొదటి మలయాళం సినిమాను ఈరోజే మొదలు పెట్టింది. నడికర్ తిలకం అనే టైటిల్ తో తెరకెక్కుతున్న మూవీని మైత్రీ మూవీస్ తెరకెక్కిస్తోంది.
ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఈరోజే పూర్తయ్యాయి. టోవినో థామస్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాను మలయాళం సినిమా డ్రైవింగ్ లైసెన్స్ తో పేరు తెచ్చుకున్న దర్శకుడు లాల్ జూనియర్ డైరెక్ట్ చేస్తున్నారు.
Details
నడికర్ తిలకం రెగ్యులర్ షూటింగ్ మొదలు
మైత్రీ మూవీ మేకర్స్, గాడ్ స్పీడ్ సంస్థలు తెరకెక్కిస్తున్న నడికర్ తిలకం అనే సినిమాకు వై రవిశంకర్, నవీన్ యేర్నేని, అల్లన్ ఆంటోనీ, అనూప్ వేణు గోపాల్ నిర్మాతలుగా ఉన్నారు.
కొచ్చిలో పూజా కార్యక్రమాలతో మొదలైన సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఈరోజు నుండే మొదలు కాబోతుంది. నాలుగు నెలల పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరగనుంది.
టోవినో థామస్ హీరోగా కనిపిస్తున్న ఈ సినిమాలో భావన హీరోయిన్ గా కనిపిస్తోంది. సౌబిన్ సాహిర్, ధ్యాన్ శ్రీనివాసన్, అనూప్ మీనన్, టామ్ షైన్ చాకో, అజు వర్గీస్, శ్రీనాథ్ బాసి నటిస్తున్నారు.
యక్జాన్ గ్యారీ పెరీరా, నేహా నాయర్ సంగీతం అందిస్తున్నారు.