Nag Ashwin: కల్కి యూనివర్స్‌లోకి కొత్త కథలు.. దుల్కర్, సాయి పల్లవికి ప్రత్యేక సిరీస్‌లు?
ఈ వార్తాకథనం ఏంటి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లలో 'కల్కి 2898 ఏడీ' ఒకటి. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న 'కల్కి 2' కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో భాగాన్ని మరిన్ని ఆసక్తికరమైన మార్పులు, కొత్త అంశాలతో రూపొందించేందుకు చిత్రబృందం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకుని నాగ్ అశ్విన్ కూడా 'కల్కి' ప్రపంచాన్ని మరింత విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
వివరాలు
'కల్కి'ప్రపంచాన్ని మరింత పెద్ద స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు
ఇప్పటికే 'కల్కి 2'పై దృష్టి పెట్టిన ఆయన..ఈ యూనివర్స్‌లో కీలక పాత్రలు పోషించిన దుల్కర్ సల్మాన్,సాయి పల్లవిల పాత్రల ఆధారంగా ప్రత్యేక సిరీస్‌లను రూపొందించాలని ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ ప్రణాళికలు కార్యరూపం దాలిస్తే'కల్కి'సినిమాటిక్ యూనివర్స్ మరింత విస్తరించే అవకాశం ఉంది.
ఇప్పటికే మొదటి భాగం విడుదలకు ముందు ఈ చిత్రానికి సంబంధించిన యానిమేషన్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు దుల్కర్ సల్మాన్,సాయి పల్లవిల పాత్రలతో కూడా ప్రత్యేక సిరీస్‌లు రూపొందిస్తారా?అన్నది ఆసక్తికరంగా మారింది.
మొత్తానికి నాగ్ అశ్విన్ తనదైన విజన్‌తో'కల్కి'ప్రపంచాన్ని మరింత పెద్ద స్థాయిలో తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.