LOADING...
Nag Ashwin: నాగ్ అశ్విన్ షాకింగ్ రివీల్.. సెట్స్‌లో కోపం వస్తే ఇలా రియాక్ట్ అవుతాడట!
నాగ్ అశ్విన్ షాకింగ్ రివీల్.. సెట్స్‌లో కోపం వస్తే ఇలా రియాక్ట్ అవుతాడట!

Nag Ashwin: నాగ్ అశ్విన్ షాకింగ్ రివీల్.. సెట్స్‌లో కోపం వస్తే ఇలా రియాక్ట్ అవుతాడట!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 17, 2026
09:24 am

ఈ వార్తాకథనం ఏంటి

లెజెండర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో రూపొందించిన వినూత్న చిత్రం 'సింగ్ గీతం' (Sing Geetham) ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ సమర్పకుడిగా, నిర్మాతగా వ్యవహరించారు. సినిమా సక్సెస్‌ఫుల్ రన్ కొనసాగుతున్న నేపథ్యంలో నాగ్ అశ్విన్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో ఆయనకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. 'కల్కి 2898 ఏడీ' వంటి భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు తీసేటప్పుడు సెట్స్‌పై ఎప్పుడైనా కంట్రోల్ తప్పి కోపం వస్తుందా? అసిస్టెంట్లపై అరుస్తారా? అనే ప్రశ్న జర్నలిస్టులు అడిగారు. దీనికి నాగ్ అశ్విన్ చాలా ప్రాక్టికల్‌గా, మెచ్యూర్డ్‌గా స్పందించారు.

వివరాలు

కోపాన్ని చూపడం అసలు ఇష్టం ఉండదు

షూటింగ్ సమయంలో కొన్ని సందర్భాల్లో టెన్షన్ రావడం సహజమని ఆయన చెప్పారు. మూడ్ డిస్టర్బ్ అవుతుందని కూడా అంగీకరించారు. అయితే తన కోపాన్ని లేదా చిరాకును చుట్టూ ఉన్న వారిపై చూపించడాన్ని అస్సలు ఇష్టపడనని స్పష్టం చేశారు. ఒకవేళ సెట్స్‌లో ఉన్నవారిపై గట్టిగా అరిస్తే వాతావరణం దెబ్బతింటుందని, పనితీరు తగ్గిపోతుందని, చివరికి అది రీ-షూట్స్ వరకు దారితీస్తుందని వివరించారు. సెట్స్‌లో పని చేసే ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో ముఖ్యమని నాగ్ అశ్విన్ తెలిపారు. డైరెక్టర్ మనసులో ఉన్న విజన్‌ను స్క్రీన్‌పైకి తీసుకురావడానికి వారు రాత్రింబవళ్లు శ్రమిస్తారని చెప్పారు. అందుకే సమస్య వచ్చినప్పుడు ఎవరిపై అరవడం కాకుండా, దాన్ని ఎలా పరిష్కరించాలో ఆలోచించడం తన విధానమని అన్నారు.

వివరాలు

'కల్కి 2' పనుల్లో బిజీ

అలాగే కొన్నిసార్లు తనపై తనకే ఎక్కువ కోపం వస్తుందని ఆయన వెల్లడించారు. సెట్స్‌లో ఏదైనా సమస్య ఎదురైతే, దాన్ని ముందే ఎందుకు గుర్తించలేకపోయానని తనలో తానే ఆలోచిస్తూ బాధపడతానని నిజాయితీగా చెప్పారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ ఒకవైపు 'సింగ్ గీతం' విజయాన్ని ఆస్వాదిస్తూనే, మరోవైపు రెబెల్ స్టార్ ప్రభాస్తో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్ 'కల్కి 2' (Kalki 2) దర్శకత్వ పనుల్లో బిజీగా ఉన్నారు.

Advertisement