Page Loader
కస్టడీ ట్రైలర్: ముఖ్యమంత్రి కారునే ఆపేసిన కానిస్టేబుల్ 
కస్టడీ ట్రైలర్ విడుదల

కస్టడీ ట్రైలర్: ముఖ్యమంత్రి కారునే ఆపేసిన కానిస్టేబుల్ 

వ్రాసిన వారు Sriram Pranateja
May 05, 2023
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాగ చైతన్య, క్రితిశెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం కస్టడీ. తమిళ దర్శకుడు మానాడు ఫేమ్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఇంతకుముందే విడుదలైంది. రెండున్నర నిమిషాల ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం. ట్రైలర్ లో కనిపించిన మొదటి షాట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సీఎం సెక్యూరిటీకి వెళ్ళిన నాగ చైతన్య, ముఖ్యమంత్రి కారునే ఆపుతాడు. ఆ తర్వాత షాట్ లో నాగ చైతన్య లవ్ ఇంట్రెస్ట్ క్రితిశెట్టిని పాత్రను చూపించారు. వీరిద్దరి మధ్య గాఢమైన ప్రేమ ఉన్నట్టుగా చూపించారు. నెక్స్ట్ షాట్ లో ఓ ప్రముఖ పర్సన్ ను నాగచైతన్య అరెస్ట్ చేసినట్టు చూపిస్తారు. అక్కడి నుండే సినిమా కథ మలుపు తిరుగుతుందని ట్రైలర్ లో తెలుస్తోంది.

Details

ఆసక్తికరంగా ఉన్న వాటర్ సీక్వెన్సెస్ 

ఈ సినిమాలో వాటర్ సీక్వెన్సెస్ కీలకంగా ఉన్నాయని ట్రైలర్ లో చూపించారు. డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. నిజం గెలవడం లేటవుతుంది కావచ్చు తప్పకుండా నిజం గెలుస్తుందనే డైలాగ్ బాగుంది. ట్రైలర్ లో నాగ చైతన్య లుక్ చాలా కొత్తగా ఉంది. అంతకుముందు సినిమాలతో పోల్చితే ఇందులో బాగా కనిపిస్తున్నాడు. అరవింద్ స్వామి విలన్ గా చేస్తున్నాడు. శరత్ కుమార్, సంపత్ రాజ్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇళయారాజా, యువన్ శంకర్ రాజా.. ఇద్దరూ సంయుక్తంగా సంగీతం అందించారు. మే 12వ తేదీన తెలుగు, తమిళంలో విడుదల అవుతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కస్టడీ ట్రైలర్ విడుదల