
Naga Chaitanya-Sobhita: తల్లిదండ్రులు కాబోతున్న నాగచైతన్య, శోభిత?
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో ప్రముఖ నటుడు అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఆయన 2009లో విడుదలైన 'జోష్' చిత్రంతో సినిమారంగానికి అడుగుపెట్టారు. అయితే, 'ఏ మాయ చేసావే' సినిమాతో మంచి విజయం అందుకోవడమే కాకుండా, అదే సినిమాలో నటించిన సమంతతో ప్రేమలో పడ్డారు.
కొంతకాలం ప్రేమలో మునిగి తేలిన ఈ జంట,కుటుంబ సభ్యుల అనుమతితో 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
అయితే, వారి దాంపత్య జీవితం ఎక్కువకాలం నిలవలేదు. అభిప్రాయ భేదాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు.
అనంతరం నాగచైతన్య యువ నటి శోభిత దూళిపాళతో సన్నిహితంగా కనిపించారు. వీరిద్దరూ కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత, గత సంవత్సరం ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు.
వివరాలు
'తండేల్' సినిమాతో అక్కటుకున్న నాగచైతన్య
ఈ విషయాన్ని నాగచైతన్య తండ్రి, సీనియర్ నటుడు నాగార్జున అధికారికంగా వెల్లడించడంతో ఫ్యాన్స్‌కు ఆశ్చర్యం కలిగింది.
ఆ తర్వాత ఈ జంట అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా వివాహం చేసుకుంది.
వివాహం అనంతరం శోభిత సినీ ప్రాజెక్టులకు కొంతదూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్‌గా ఉండి తరచూ పోస్టులు చేస్తూ ఉంటారు.
ఇక నాగచైతన్య విషయానికి వస్తే, పెళ్లి తర్వాత 'తండేల్' అనే సినిమాతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.
ప్రస్తుతం ఆయన కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ మైథలాజికల్ థ్రిల్లర్‌లో నటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక తాజాగా, నాగచైతన్య-శోభిత జంటను సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
వివరాలు
అధికారికంగా వెల్లడించబోతున్నారని టాక్
ఈ దంపతులు ప్రస్తుతానికి కెరీర్‌ను కొంతకాలం పక్కన పెట్టి, వ్యక్తిగత జీవితాన్ని మరింత ఆస్వాదించాలని భావిస్తున్నారని సమాచారం.
అంతేకాకుండా, వీరిద్దరూ తల్లిదండ్రులయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని, శోభిత త్వరలోనే గర్భవతిగా ఉన్న విషయాన్ని అధికారికంగా వెల్లడించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
అయితే, ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు. అయినప్పటికీ, కొందరు అభిమానులు ఇది నమ్మదగిన సమాచారం అని భావిస్తుండగా, మరికొందరు మాత్రం ఈ ప్రచారాన్ని అవాస్తవంగా కొట్టిపారేస్తున్నారు.