
Bad Boy Karthik Teaser: నాగ శౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' టీజర్‌తో కొత్త లుక్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'బ్యాడ్ బాయ్ కార్తీక్' టీజర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. టీజర్ నిడివి తక్కువగా ఉన్నప్పటికీ, అందులోని విజువల్స్, డైలాగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. బ్యాడ్ బాయ్ అనుకుంటే.. స్మార్ట్ బాయ్ లా ఉన్నావ్ అనే డైలాగ్‌తో ప్రారంభమై, నాగశౌర్య తన ఎనర్జిటిక్ మాస్ అవతారాన్ని ప్రదర్శించారు. ఇప్పటి వరకు ఆయన చేసిన సాఫ్ట్ బాయ్ ఇమేజ్‌తో భిన్నంగా, ఈసారి యాక్షన్ మోడ్‌లో కనిపించనున్నారు.
Details
సాయి కుమార్, పూర్ణ కీలక పాత్రలు
టీజర్‌లో సాయి కుమార్ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో పూర్ణ సీరియస్ లుక్‌లో కనిపించి కథకు బలమైన బ్యాక్‌డ్రాప్‌ను అందించారు. యాక్షన్, ఎమోషన్ మిక్స్‌తో ఈ సినిమా వినోదాత్మకంగా ఉంటుందని టీజర్ స్పష్టంగా తెలియజేస్తోంది. ప్రసిద్ధ మ్యూజిక్ డైరెక్టర్ హరీష్ జైరాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు కట్స్ టీజర్ టోన్‌ను మరింత షార్ప్‌గా తీర్చింది. రామ్ దేసిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'విధి' హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం 'వైష్ణవి ఫిల్మ్స్' బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ నుంచి వస్తున్న మొదటి సినిమా కావడం విశేషం. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.