Page Loader
Naga Vamsi: నాగ వంశీ బావమరిది హీరోగా గ్రాండ్ ఎంట్రీ.. హీరోయిన్ ఎవరో తెలుసా?
నాగ వంశీ బావమరిది హీరోగా గ్రాండ్ ఎంట్రీ.. హీరోయిన్ ఎవరో తెలుసా?

Naga Vamsi: నాగ వంశీ బావమరిది హీరోగా గ్రాండ్ ఎంట్రీ.. హీరోయిన్ ఎవరో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 07, 2025
04:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లోకి మరో కొత్త హీరో అరంగేట్రం చేయనున్నాడు. ప్రముఖ నిర్మాత నాగ వంశీ బావమరిదిగా రుష్యా హీరోగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే సినీ నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగ వంశీ, ఇప్పుడు తన కుటుంబ సభ్యుడిని హీరోగా పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమలో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత చిన్నబాబు ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత ఆయన సోదరుడి కుమారుడు నాగ వంశీ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ను ప్రారంభించి, వరుస విజయాలతో టాలీవుడ్‌లో ట్రెండింగ్ ప్రొడ్యూసర్‌గా మారిపోయారు.

Details

హీరోయిన్ గా మిర్నా

ఆయన చేసే ట్వీట్స్, ఇంటర్వ్యూలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతాయి. అందుకే నాగ వంశీ ఇప్పుడు టాలీవుడ్‌లో "వైరల్ ప్రొడ్యూసర్"గా గుర్తింపు పొందారు. ఇక ఇప్పుడు ఆయన బావమరిదిగా రుష్యా హీరోగా తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ఈ చిత్రంలో మిర్నా హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. చిత్రాన్ని బన్నీ ముప్పానేని నిర్మిస్తున్నారు. బన్నీ ముప్పానేని గతంలో 'కలర్ ఫోటో', 'తెల్లారితే గురువారం', 'బెదురులంక 2012' వంటి విజయవంతమైన సినిమాలను నిర్మించారు. ఈ కొత్త హీరో టాలీవుడ్‌లో ఏ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటాడో చూడాలి!