LOADING...
Chiranjeevi: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాగబాబు.. ఆనందంతో ఉప్పొంగిన అభిమాని!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాగబాబు.. ఆనందంతో ఉప్పొంగిన అభిమాని!

Chiranjeevi: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాగబాబు.. ఆనందంతో ఉప్పొంగిన అభిమాని!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 08, 2025
12:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

తిరుపతికి చెందిన మురళి అనే ఓ పెద్దాయన ఇటీవల సోషల్ మీడియాలో స్టార్‌గా మారిపోయాడు. మెగాస్టార్ చిరంజీవి పాటలకు ఆయన వేసిన డ్యాన్స్‌లు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ వీడియోలు వేగంగా వైరల్ కావడంతో మురళి ప్రసిద్ధ డ్యాన్స్ రియాలిటీ షో 'ఢీ' వేదికపై కూడా కనిపించాడు. అక్కడ తన ఉత్సాహభరితమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను, జడ్జీలను అలరించాడు. దీపావళి ప్రత్యేక ఎపిసోడ్‌లో మురళి మరోసారి స్టేజ్‌ను కుదిపేసాడు. ఆ ఈవెంట్‌కు గెస్ట్‌గా హాజరైన నాగబాబు ఆయన ప్రతిభను చూసి మురళిపై మంత్ర ముగ్ధుడయ్యారు. చిరంజీవి అభిమాని అయిన మురళికి "నీ కలను నిజం చేస్తా... నిన్ను స్వయంగా చిరంజీవి గారిని కలిపిస్తా" అని నాగబాబు ఇచ్చిన హామీ మురళిని కంటతడి పెట్టించింది

Details

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

. తాజాగా నాగబాబు తన మాట నిలబెట్టుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ స్పాట్‌కు మురళిని తీసుకెళ్లి, అతనితో కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ క్షణం మురళి జీవితంలో మరచిపోలేని ఘట్టంగా నిలిచిపోయింది. 'ఢీ' షోలో ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు ప్రసారమయ్యాయి. చిరంజీవిని చూసిన మురళి ఆనందభాష్పాలు పెట్టాడు. 'మీరు లేనిదే నేను లేను సర్... ఇక చనిపోయినా పర్లేదంటూ భావోద్వేగంతో మాట్లాడాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది. ఇక చిరంజీవి కూడా మురళికి పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఒక రోజు నా సినిమాలో నా పక్కన డ్యాన్స్ వేస్తావు అని హామీ ఇచ్చారు.

Details

 భావోద్వేగానికి గురైన అభిమాని

ఈ మాటతో మురళి ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి. ఈ సంఘటనపై అభిమానులు, నెటిజన్లు చిరంజీవి దయ, నాగబాబు మానవత్వం, మురళి ప్యాషన్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సాధారణ అభిమాని కలను నెరవేర్చిన ఈ ఘటన ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం చిరంజీవి పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం సంక్రాంతికి సందర్భంగా విడుదల కానుండగా, 'విశ్వంభర' చిత్రం సమ్మర్‌లో విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.