BigBoss 9: 'బిగ్‌బాస్' సీజన్ 9 వచ్చేస్తుంది.. 'ఈ సారి చదరంగం కాదు.. రణరంగమే'.. ప్రోమో రిలీజ్.. హోస్ట్ ఎవరంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగులో ఇప్పటికే ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తిచేసుకున్న బిగ్ బాస్,ఇప్పుడు తొమ్మిదవ సీజన్‌కు సిద్ధమవుతోంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానుంది.తాజాగా విడుదల చేసిన ప్రోమోతో దీనిపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ ప్రోమోలో కింగ్ నాగార్జున హోస్ట్‌గా మళ్లీ దర్శనమిచ్చారు. గతకొంతకాలంగా హోస్ట్‌ను మారుస్తారని జోరుగా ప్రచారం జరిగినప్పటికీ, ఆర్గనైజర్స్ మళ్లీ నాగార్జుననే ఎంపిక చేశారు. ప్రోమోలో నాగార్జున మాట్లాడుతూ.."ఆటలో అలసిపోతే గెలుపు సాధ్యం కాదు.గెలవాలంటే యుద్ధం చేస్తే సరిపోదు,కొన్ని సార్లు ప్రభంజనం సృష్టించాలి. ఈసారి చదరంగం కాదు... ఇది రణరంగం!" అని చెప్పారు. ఆయన స్టైలిష్ లుక్‌తో ఈ డైలాగ్‌లు చెప్పడం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈసారి బిగ్ బాస్ హౌస్‌లో ఎవరు పాల్గొంటారో అనేది ఆసక్తికరంగా మారింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
స్టార్ మా చేసిన ట్వీట్
Ee sari chadharangam kaadu ranarangame 👑🔥👁️#BiggBossSeason9 Coming Soon on #StarMaa #BiggBossSeason9ComingSoon#BiggBossTelugu #BiggbossTelugu9 pic.twitter.com/r1tbknHviN
— Starmaa (@StarMaa) June 26, 2025