Nagarjuna: యువ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగార్జున
ధనుష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'కుబేర' చిత్రంలో నాగార్జున ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. శే ఖర్ కమ్ముల దర్శకత్వంలో నిర్మితమైన ఈ సినిమా సంక్రాంతి తరువాత ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రానంతరం నాగార్జున కొత్తగా ఏ సినిమాను చేస్తారు? అనే ప్రశ్న ఆయన అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. 'నా సామిరంగ' చిత్రం తరువాత నాగార్జున పూర్తిస్థాయి హీరోగా కనిపించలేదు. ఈ కారణంగా ఆయన సోలో హీరోగా నటించే కొత్త చిత్రాన్ని చూడటానికి అక్కినేని అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు.
నాగార్జున నటించే ఈ కొత్త ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తి
ఇలాంటి సమయంలో, ఫిల్మ్ సర్కిల్స్‌లో ఓ ఆసక్తికరమైన వార్త చర్చనీయాంశమైంది. వివరాల ప్రకారం, 'హుషారు' సినిమాతో యువతరానికి చేరువైన దర్శకుడు హర్ష ఇటీవల నాగార్జునను కలిసి ఓ కథ వినిపించారట. నాగార్జునకు ఆ కథ ఎంతో నచ్చడంతో, ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు కొనసాగుతున్నాయి, జనవరిలో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం అయ్యే అవకాశముంది. ఇదిలా ఉండగా, హర్ష దర్శకత్వంలో రూపొందిన 'ఓం భీం బుష్' సినిమా ఇటీవల విడుదలైంది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నాగార్జున నటించే ఈ కొత్త ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.