LOADING...
Nagarjuna: 'లెనిన్‌' రిలీజ్ డేట్ ఫిక్స్‌.. రూమర్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టిన నాగ్

Nagarjuna: 'లెనిన్‌' రిలీజ్ డేట్ ఫిక్స్‌.. రూమర్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టిన నాగ్

వ్రాసిన వారు Moogati Shabari
Apr 29, 2026
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

అక్కినేని అఖిల్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'లెనిన్‌' సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మురళీకిశోర్‌ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాపై నాగార్జున తాజాగా స్పందిస్తూ ఒక పోస్ట్‌ చేశారు. అందులో ప్రేక్షకులు ఈ చిత్రంలో కొత్త అఖిల్‌ను చూస్తారని పేర్కొన్నారు. తాను ఇప్పటికే సినిమా ఫస్ట్‌ కట్‌ చూసానని, అది చూసిన తర్వాత పూర్తి నమ్మకంతో ఈ మాట చెబుతున్నానని తెలిపారు. అలాగే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం 'లెనిన్‌' జూన్‌ 26న ప్రేక్షకుల ముందుకు వస్తుందని స్పష్టం చేశారు.

వివరాలు

ఆ వార్తలకు చెక్ పెట్టిన నాగ్..

ప్రారంభంలో ఈ సినిమాను మే 1న విడుదల చేయాలని భావించారు. అయితే రామ్‌ చరణ్‌ నటిస్తున్న 'పెద్ది' చిత్రం ఏప్రిల్‌ 30న విడుదలవుతుందని ప్రకటించడంతో 'లెనిన్‌' విడుదల తేదీని జూన్‌ 26కు మార్చారు. అనంతరం 'పెద్ది' సినిమా జూన్‌ 25కు వాయిదా పడటంతో, 'లెనిన్‌' మళ్లీ వెనక్కి వెళ్లే అవకాశముందని కొన్ని రోజులుగా వార్తలు వినిపించాయి. కానీ నాగార్జున తాజా పోస్ట్‌తో ఆ వార్తలకు స్పష్టత వచ్చింది.

వివరాలు

చిత్తూరు నేపథ్యంలో కథ..

చిత్తూరు ప్రాంతం నేపథ్యంగా ఈ కథ సాగనుంది. బలమైన భావోద్వేగాలు, ఆసక్తికరమైన కథనం కలగలిపి ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించేలా 'లెనిన్‌' చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు యూట్యూబ్‌లో మంచి స్పందనతో ట్రెండ్‌ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement