
OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాగార్జున 'నా సామి రంగ'.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ కింగ్ నాగార్జున లీడ్ రోల్‌లో నటించి.. సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ అయిన సినిమా 'నా సామి రంగ'.
ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రం మలయాళ చిత్రం 'పొరింజు మరియం జోస్'కి రిమేక్. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు 'డిస్నీ ప్లస్ హాట్‌స్టార్' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో పాటు స్ట్రీమింగ్ కోసం సినిమా అందుబాటులో ఉంది.
ఈ చిత్రంలో అల్లరి నరేష్, ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రాజ్ తరుణ్, నాసర్, షబీర్ కల్లరక్కల్ కీలక పాత్రల్లో నటించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సినిమా స్ట్రీమింగ్
#NaaSaamiRanga Streaming now in Telugu Tamil and Kannada. #NaaSaamiRangaonHotstar@iamnagarjuna @allarinaresh @mmkeeravaani @vijaybinni4u @itsRajTarun @AshikaRanganath @mirnaaofficial @RuksharDhillon @srinivasaaoffl @boselyricist @ChotaKPrasad @DisneyPlusHSTel pic.twitter.com/p0U1vy3aJD
— GSK Media (@GskMedia_PR) February 17, 2024