NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్.. బెయిల్ ఇవ్వదంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్
    తదుపరి వార్తా కథనం
    Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్.. బెయిల్ ఇవ్వదంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్
    పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్.. బెయిల్ ఇవ్వదంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్

    Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్.. బెయిల్ ఇవ్వదంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 21, 2023
    07:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

    గత రాత్రి గజ్వేల్‌లో అరెస్టు చేసిన అనంతరం ఆరు గంటల పాటు విచారణ జరిపారు.ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడంతో అరెస్టు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

    సెలబ్రిటీ హోదా ఎవరిని చట్టపరమైన పరిణామాల నుండి మినహాయించదని నొక్కిచెప్పిన పోలీసులు, చట్టానికి అతీతంగా ప్రవర్తించడం మానుకోవాలని ప్రజలను కోరారు.

    రాత్రి, పల్లవి ప్రశాంత్,అతని సోదరుడిని న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. వారు వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు.

    అనంతరం పోలీసులు వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

    Details 

    మరో 16 మంది అరెస్టు

    బిగ్ బాస్ షోలో పాల్గొన్న వారిపై కాకుండా షో హోస్ట్ నాగార్జునపై పోలీసులు కేసు పెట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.

    బిగ్ బాస్ సీజన్ 7 ముగింపు తర్వాత బస్సులు, పోలీసు వాహనాలను ధ్వంసం చేసిన మరో 16 మందిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

    వీరిలో 12 మంది మేజర్లు,నలుగురు మైనర్లు ఉన్నారు. అరెస్టయిన వారందరినీ జూబ్లీహిల్స్ పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు.

    ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది.ఈ సందర్భంగా పల్లవి తరపు న్యాయవాది పల్లవి ప్రశాంత్, అతని సోదరుడికి బెయిల్ మంజూరు చేయాలని కోరారు.

    Details 

    బెయిల్ పై తీర్పు రేపటికి వాయిదా

    ఇక పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఆయన ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ కి బెయిల్ ఇవ్వదని కోరారు.

    ఒకవేళ బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని పేర్కొన్నారు. ఇక ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు పల్లవి ప్రశాంత్ బెయిల్ పై తీర్పు రేపటికి వాయిదా వేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బిగ్ బాస్ 7

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    బిగ్ బాస్ 7

    Bigg Boss 7: 'బిగ్ బాస్ 7' ఎలా ఉంటుందో చెప్పిసిన నాగార్జున బిగ్ బాస్ తెలుగు
    బిగ్‌బాస్ షోలో అశ్లీల ప్రసారంపై మండిపడ్డ ఏపీ హైకోర్టు.. సెన్సార్ లేకపోవడంపై ఆగ్రహం  బిగ్ బాస్ తెలుగు
    బిగ్ బాస్ సీజన్ 7ని ఆసక్తిగా మార్చేందుకు ప్రయత్నం: సురేఖావాణి, సుప్రీతలను తీసుకువచ్చే ఛాన్స్?  టెలివిజన్
    బిగ్‍బాస్- 7కు ముహుర్తం ఖరారు.. ఇప్పటికే భారీ అంచ‌నాలు పెంచిన టీజ‌ర్‌ బిగ్ బాస్ తెలుగు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025