Page Loader
Skanda Pre Release Thunder స్కంద కోసం అఖండ వచ్చేస్తున్నాడు 
ఆగస్టు 26న స్కంద ప్రీ రిలీజ్ థండర్

Skanda Pre Release Thunder స్కంద కోసం అఖండ వచ్చేస్తున్నాడు 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 25, 2023
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన స్కంద సినిమా సెప్టెంబర్ 15వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ థండర్ పేరుతో ఆగస్టు 26వ తేదీన ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ ప్రోగ్రామ్ లో స్కంద ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ అతిథిగా వచ్చేస్తున్నారని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. స్కంద కోసం అఖండ వచ్చేస్తున్నాడని తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడి చేసింది. శ్రీలీల హీరోయిన్ గా కనిపిస్తున్న స్కంద సినిమా, పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో విడుదలవుతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్