Page Loader
Breathe OTT: OTT ప్రీమియర్ తేదీని ఖరారు చేసుకున్న నందమూరి చైతన్య కృష్ణ 'బ్రీత్' 
OTT ప్రీమియర్ తేదీని ఖరారు చేసుకున్న నందమూరి చైతన్య కృష్ణ 'బ్రీత్'

Breathe OTT: OTT ప్రీమియర్ తేదీని ఖరారు చేసుకున్న నందమూరి చైతన్య కృష్ణ 'బ్రీత్' 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 05, 2024
10:36 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్, లెజెండరీ నటుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పెద్ద కుమారుడు జయ కృష్ణ వార‌సుడిగా చైత‌న్య కృష్ణ 'బ్రీత్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కొడుకును హీరోగా ప‌రిచ‌యం చేయ‌డం కోసం జ‌య‌కృష్ణ స్వ‌యంగా ఈ సినిమాను నిర్మించాడు. దాదాపు నాలుగు కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన‌ ఈ మూవీ.. భారీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఇప్పుడు, ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌‌కి మార్చి 8న ముహూర్తం ఖారారు చేశారు. పాపులర్ తెలుగు OTT ప్లాట్‌ఫారమ్, ఆహా, బ్రీత్‌ను విడుదల చేస్తోంది.

Details 

కథానాయికగా వైదిక సెంజలియా 

ఈ సినిమా చూడటం మిస్ అయిన నందమూరి అభిమానులకు మహిళా దినోత్సవం, మహా శివరాత్రి సందర్భంగా బ్రీత్ చిత్రంను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్‌పై చైతన్యకృష్ణ తండ్రి జయకృష్ణ నిర్మించగా, వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకుడు. ఈ చిత్రంలో వైదిక సెంజలియా కథానాయికగా నటించగా, మార్క్ కె రాబిన్ సంగీతం సమకూర్చారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆహా చేసిన ట్వీట్