Page Loader
వరుస ఫ్లాపులు ఇచ్చిన దేవకట్టా చేతిలో నాలుగు ప్రాజెక్టులు
ఒకేసారి 4ప్రాజెక్టులు ప్రకటించిన దేవకట్టా

వరుస ఫ్లాపులు ఇచ్చిన దేవకట్టా చేతిలో నాలుగు ప్రాజెక్టులు

వ్రాసిన వారు Sriram Pranateja
Feb 14, 2023
06:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

వెన్నెల, ప్రస్థానం వంటి విభిన్న చిత్రాలకు దర్శకత్వం వహించిన దేవకట్టా, సాయి ధరమ్ తేజ్ తో తీసిన రిపబ్లిక్ తర్వాత మళ్లీ సినిమాను మొదలెట్టలేదు. గత కొన్ని రోజులుగా దేవకట్టా తర్వాతి ప్రాజెక్టుల గురించి అనేక వార్తలు వచ్చాయి. రెండేళ్ళుగా ఒక్క సినిమా గురించి కూడా అప్డేట్ రాలేదు. తాజాగా దేవకట్టా, తాను చేస్తున్న సినిమాల గురించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు ప్రాజెక్టులున్నాయి. అందులో ఇంద్రప్రస్థం ఒకటి కాగా, జ్ఞానపీఠ్ అవార్డ్ అందుకున్న రచనను వెండితెర మీదకి తీసుకొస్తున్నాడట. అది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉందని చెప్పుకొచ్చాడు. ఇవి రెండూ వెబ్ సిరీస్ లు కావడం విశేషం.

దేవకట్టా

రెండు భాగాల సినిమాను తీసుకొస్తున్న దేవకట్టా

దేశ వ్యాప్తంగా రెండుభాగాల సినిమాలు ట్రెండింగ్ లో ఉన్నాయి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రెండు భాగాలుగా తమ కథలతో సినిమాలు తీస్తున్నారు. ఆ జాబితాలోకి దేవకట్టా కూడా చేరిపోయాడు. రెండు భాగాల సినిమా అని చెప్పాడు కానీ అది ఏ జోనర్ లో ఉంటుందో చెప్పలేదు. అలాగే మరోమూవీ ఉందని, సినిమాలకు సంబంధించిన పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడి చేస్తానని చెప్పాడు. దేవకట్టా కేరీర్ లో సరైన హిట్ లేదు, వెన్నెల సినిమాకు మంచి పేరు వచ్చింది. ప్రస్థానం సినిమాతో విమర్శకులను మెప్పించగలిగాడు. కానీ కమర్షియల్ గా సరైన హిట్ రాలేదు. నాగ చైతన్య హీరోగా ఆటోనగర్ సూర్య మూవీ, కమర్షియల్ గా వర్కౌట్ అవలేదు.