Page Loader
COURT: నాని-ప్రియదర్శి కాంబో.. కోర్ట్‌లోని పాత్రలపై క్లారిటీ
నాని-ప్రియదర్శి కాంబో.. కోర్ట్‌లోని పాత్రలపై క్లారిటీ

COURT: నాని-ప్రియదర్శి కాంబో.. కోర్ట్‌లోని పాత్రలపై క్లారిటీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 04, 2025
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌ యాక్టర్‌ ప్రియదర్శి, నాని కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్‌ 'కోర్ట్' (Court) గురించి ఆసక్తికరమైన వివరాలు వెల్లడయ్యాయి. ఈ చిత్రంలో ప్రియదర్శి లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమా State vs A Nobody అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతోంది. రామ్ జగదీష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, కోర్టు గదిలో న్యాయవాదులు తమ వాదనలతో ఉత్కంఠభరితంగా నాటకాన్ని కొనసాగించే విధంగా రూపొందించారు. తాజాగా ఈ సినిమా పాత్రలను పరిచయం చేసే బిహైండ్ ది క్యారెక్టర్స్ వీడియోను విడుదల చేయగా, అందులో పాత్రల పరిచయంతో పాటు శివాజీని మంగపతిగా, రోహిణిని సీతారత్నంగా చూపిస్తున్నట్లు డైరెక్టర్‌ తెలిపారు.

Details

లాయర్ పాత్రలో ప్రియదర్శ

ఈ సినిమాలో ప్రియదర్శి లాయర్‌గా కనిపించనున్నారు. ఈ వీడియోతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. కోస్టల్ ఏరియా, డాక్యుమెంట్స్, కోర్టు బోను, న్యాయ దేవత లాంటి విజువల్స్‌తో రూపొందించిన మోషన్‌ పోస్టర్ ఇప్పటికే సినిమా మీద మరింత క్యూరియాసిటీ రేపుతోంది. కోర్టు గదిలో న్యాయవాదులు ఎలా తమ వాదనలతో ఉత్కంఠభరితమైన సస్పెన్స్‌ తో కోర్టు కేసును కొనసాగిస్తారో అనే ప్రశ్న ప్రేక్షకుల్లో ఆసక్తిని నింపుతోంది. ఈ చిత్రాన్ని వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిరినేని నిర్మిస్తున్నారు. అలాగే నాని సోదరి దీప్గి ఘంటా ఈ ప్రాజెక్ట్‌కు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ రిలీజ్ చేసిన వీడియో