LOADING...
Nani: శేఖర్ కమ్ములకి నాని షాక్ ఇచ్చాడా? ఫిలింనగర్‌లో హాట్ టాపిక్!
శేఖర్ కమ్ములకి నాని షాక్ ఇచ్చాడా? ఫిలింనగర్‌లో హాట్ టాపిక్!

Nani: శేఖర్ కమ్ములకి నాని షాక్ ఇచ్చాడా? ఫిలింనగర్‌లో హాట్ టాపిక్!

వ్రాసిన వారు Moogati Shabari
Mar 17, 2026
10:24 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో నేచురల్ స్టార్‌గా గుర్తింపు పొందిన నాని ప్రస్తుతం తన కెరీర్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా టాప్ హీరోల సరసన నిలబడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో వరుసగా మాస్ ఎంటర్టైనర్‌లను ఎంపిక చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు క్లాస్ సినిమాల ద్వారా ప్రత్యేకమైన పేరు సంపాదించిన ఆయన, ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించే మాస్ చిత్రాలపై ఎక్కువగా దృష్టి పెట్టుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే క్లాస్ కథలతో ప్రసిద్ధి చెందిన దర్శకుడు శేఖర్ కమ్ముల చెప్పిన కథను నాని తిరస్కరించినట్లు సమాచారం.

వివరాలు

అందుకే రిజెక్ట్ చేశారా?

సాధారణంగా శేఖర్ కమ్ముల సినిమాలు సున్నితమైన భావోద్వేగాలతో, క్లాస్ టచ్‌తో సాగుతాయి. నాని కోసం ఆయన ప్రత్యేకంగా ఒక మంచి కథను సిద్ధం చేసినప్పటికీ, ప్రస్తుతం తాను పూర్తిగా మాస్ ఇమేజ్‌పైనే దృష్టి పెట్టానని నాని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో శేఖర్ కమ్ముల కొంత నిరాశకు గురైనట్లు ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది.

వివరాలు

హ్యాపీడేస్2 స్టోరీ రెడీ

ఇక గతంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన 'లవ్ స్టోరీ' సినిమా కోసం మొదట నానినే అనుకున్నారట శేఖర్ కమ్ముల. కానీ ఆ సమయంలో కూడా నాని ఆసక్తి చూపకపోవడంతో ఆ ప్రాజెక్ట్ నాగ చైతన్యకు వెళ్లింది. ఇలా వరుసగా తన కథలను నాని తిరస్కరించడం వల్ల శేఖర్ కమ్ముల కొంత అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శేఖర్ కమ్ముల తన తదుపరి ప్రాజెక్ట్ 'హ్యాపీడేస్ 2'పై దృష్టి సారించారు. ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధమైందని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. భవిష్యత్తులో అయినా నాని - శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో సినిమా వస్తుందా అనే విషయం ఆసక్తికరంగా మారింది.

Advertisement