Page Loader
దసరా ట్రైలర్ : ఈరోజు సాయంత్రం అప్డేట్ రాబోతుంది
ఈరోజు సాయంత్రమే దసరా ట్రైలర్ పై అప్డేట్

దసరా ట్రైలర్ : ఈరోజు సాయంత్రం అప్డేట్ రాబోతుంది

వ్రాసిన వారు Sriram Pranateja
Mar 11, 2023
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మకంగా ప్రమోట్ చేస్తున్న చిత్రం దసరా. తెలుగు, తమిళం, కన్నడ, హిం,దీ మళయాలం భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్ర ప్రమోషన్ పనులు ఆసక్తిగా జరుగుతున్నాయి. తన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం కావడంతో దేశమంతా దసరా గురించి చర్చించుకునే విధంగా చేయాలని సంకల్పంగా ఉన్నాడు నాని. ఈ మధ్య రిలీజ్ చేసిన చంకీల అంగీలేసి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో విపరీతమైన హైప్ వచ్చింది. ఆ హైప్ ని మరింత పెంచడానికి ట్రైలర్ పై అప్డేట్ తో వచ్చాడు నాని. దసరా ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందనే విషయాన్ని ఈరోజు సాయంత్రం 4:05గంటలకు తెలియజేస్తాడట. ఈ మేరకు చిత్రనిర్మాణ సంస్థ ఎస్ ఎల్ వీ మూవీస్ ప్రకటించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దసరా ట్రైలర్ పై అప్డేట్, ఈరోజు సాయంత్రమే