
HIT 3: నాని హిట్ 3 ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
ఈ వార్తాకథనం ఏంటి
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'హిట్: ది థర్డ్ కేస్' (HIT 3) మే 1న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.
మిక్స్‌డ్ టాక్ వచ్చినా రూ.100 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టి కమర్షియల్ విజయం సాధించింది.
శైలేశ్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి నాని నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు.
ఈ సినిమా త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులను అలరించబోతోంది.
మే 29 అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంటుంది.
Details
నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి
థియేటర్లలో రిలీజ్ అయి కేవలం నాలుగు వారాల వ్యవధిలోనే ఓటీటీకి వస్తుండటంతో, 'హిట్ 3'కు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో నేషనల్ వైడ్‌గా మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
నాని చిత్రాలకు ఓటీటీలో విపరీతమైన ఆదరణ ఉండటంతో, ఈ మూవీ కూడా భారీ వ్యూస్ సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
సుమారు రూ.60 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి నానికి వరుసగా నాలుగో హిట్‌గా నిలిచింది.
అలాగే అతడి కెరీర్‌లో ఇది మూడో 100 కోట్లు వసూలు చేసిన సినిమా కావడం గమనార్హం.
మొత్తానికి, అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటిటిలో'హిట్ 3'ను స్ట్రీమ్ చేయొచ్చు.
యాక్షన్, థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో నాని అభిమానులకు ఇది మరోసారి మెప్పించనుంది.