Nani: ఓటీటీలోకి 'సరిపోదా శనివారం'.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే!
న్యాచురల్ స్టార్ నాని వరుస విజయాలతో జోష్ మీద ఉన్నాడు. ఇటీవల విడుదలైన 'హాయ్ నాన్న' సూపర్ హిట్ అవ్వగా, ఇప్పుడు 'సరిపోదా శనివారం'తో మరో విజయాన్ని అందుకున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాని సరసన కోలీవుడ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించగా, సూర్య కీలక పాత్రలో కనిపించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దాదాపు రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఆగస్ట్ 29 న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా నాని, సూర్య నటనకు ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. .
సెప్టెంబర్ 26న ఓటీటీలో రిలీజ్
తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించింది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 26న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.