Nani : నాని సపోర్ట్‌తో పవన్ కళ్యాణ్ స్వచ్ఛ రథాలకు భారీ బూస్ట్.. వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా నాని ఒక వీడియో విడుదల చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న స్వచ్ఛ రథాల కార్యక్రమంపై న్యాచురల్ స్టార్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ వేగంగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామీణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గ్రామాల్లో పచ్చదనం పెంపొందించడం, పరిశుభ్రతను మెరుగుపరచడం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే గ్రామాల పరిశుభ్రత కోసం "స్వచ్ఛ రథాలు" అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు.
వివరాలు
చెత్త ద్వారా సంపద..
"మన పారిశుధ్యం - మన ఆరోగ్యం - మన బాధ్యత" అనే నినాదంతో ప్రారంభమైన కార్యక్రమం ద్వారా చెత్తను వేరు చేసి, సంపద సృష్టించే దిశగా ప్రభుత్వం ప్రజల్లో అవగాహన పెంచుతోంది. కార్యక్రమం గురించి మరింత ప్రచారం జరగడానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని భావించి, నాని సహకారం కోరగా ఆయన వెంటనే స్పందించి వీడియో రూపొందించారు. వీడియోలో నాని మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ప్రారంభించిన స్వచ్ఛ రథాలు చాలా మంచి ఆలోచన అని తెలిపారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని చెప్పారు. నాని ఇచ్చిన ఈ సందేశం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న నాని వీడియో..
#PawanKalyanTransformsAP #Chapter2
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) May 2, 2026
మన పారిశుధ్యం.. మన ఆరోగ్యం.. మన బాధ్యత అన్న గౌరవ ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి ఆలోచనల నుంచి పురుడుపోసుకున్న స్వచ్ఛరథాలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పు తెస్తున్నాయి. చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో గ్రామీణ ప్రజల్ని భాగస్వాముల్ని… pic.twitter.com/iFK07jEYHl