Loading...
Nani: నాని మళ్లీ ప్రేమకథతో వస్తున్నారా? 96 డైరెక్టర్‌తో కొత్త సినిమా!
నాని మళ్లీ ప్రేమకథతో వస్తున్నారా? 96 డైరెక్టర్‌తో కొత్త సినిమా!

Nani: నాని మళ్లీ ప్రేమకథతో వస్తున్నారా? 96 డైరెక్టర్‌తో కొత్త సినిమా!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 14, 2026
10:04 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ది ప్యారడైజ్ సినిమాతో ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయిన ఆయన, ఇప్పుడు మాస్, క్లాస్ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సుజీత్ దర్శకత్వంలో బ్లడీ రోమియో సినిమాను ప్రారంభించిన నాని, మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు కూడా ఓకే చెప్పినట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన 96 సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఇటీవల సత్యం - సుందరం సినిమాతోనూ ఆయన ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

వివరాలు 

నాని, ప్రేమ్ కుమార్ కాంబినేషన్‌లో కొత్త సినిమాపై ఆసక్తి

నాని, ప్రేమ్ కుమార్ కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ సినిమా పూర్తిస్థాయి భావోద్వేగ ప్రేమకథగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

సహజమైన ప్రేమకథలను హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించడంలో ప్రేమ్ కుమార్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఆయన దర్శకత్వంలో వచ్చిన 96 సినిమా ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

ఈ నేపథ్యంలో నానితో ఆయన చేయబోయే కొత్త సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.

ఈ చిత్రంలో కేవలం ప్రేమ, రొమాన్స్‌కే పరిమితం కాకుండా, ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసే సన్నివేశాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.

వివరాలు 

కథానాయిక పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం

ఈ సినిమాలో కథానాయిక పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

బలమైన వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి పాత్రలో హీరోయిన్ కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ పాత్ర కోసం తొలుత పలువురు ప్రముఖ కథానాయికల పేర్లను పరిశీలించిన మేకర్స్, చివరకు రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

కథలో హీరోయిన్ పాత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమెను ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

నాని,ప్రేమ్ కుమార్,రుక్మిణి వసంత్ కలయిక.. ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి

రుక్మిణి వసంత్ తన నటనతో దక్షిణాది సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ప్రస్తుతం డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటిస్తున్న ఈ భామకు,నానితో సినిమా చేసే అవకాశం మరో కీలక ప్రాజెక్ట్‌గా మారే అవకాశం ఉంది.

నాని,ప్రేమ్ కుమార్,రుక్మిణి వసంత్ కలయికలో సినిమా వస్తే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొనే అవకాశం ఉంది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మరి 96 తరహాలో మరో హృదయాన్ని తాకే ప్రేమకథను ప్రేమ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తారా?

ఈ సినిమా నాని కెరీర్‌లో మరో ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందా?అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

ADVERTISEMENT